“ఒరేయ్ గుండు నాయాలా”..టాలీవుడ్ డైరెక్టర్ పై నెటిజన్ పోస్ట్ వైరల్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక జనాలు కూసింత ఓవర్ యాక్టింగ్ చేయడం ఎక్కువగా చేస్తున్నారు . మరీ ముఖ్యంగా కొంతమంది జనాలు హద్దులు మీరి పోయి స్టార్ ల పై కౌంటర్స్ వేయడం మనం చూస్తున్నాం . రీసెంట్ గా ఒక నెటిజన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ట్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న ఆనంద్ రంగాపై వేసిన సెటైరికల్ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆనంద్ రంగా ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో ఆయనకంటూ స్పెషల్ క్రేజీ ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఆనంద్ రంగా తెరకెక్కించిన సినిమాలలో వన్ ఆఫ్ ద క్యూట్ సూపర్ హిట్ మూవీ ఓయ్ . సిద్ధార్ధ్.. షామిలి హీరో హీరోయిన్లు గా ఈ సినిమాలో నటించారు . ఈ సినిమా ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న మళ్లీ థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్ .

అయితే ఈ క్రమంలోనే ఓ నెటిజన్ “ఒరేయ్ గుండు నాయాల ..ఇంత మంచి సినిమా తీసి ఎటుపోయావురా..?” అంటూ కామెంట్ పెట్టాడు . ఇది చూసిన నెటిజన్స్ కొందరు ఫైర్ అవ్వగా మరికొందరు లైట్ గా తీసుకున్నారు . అయితే డైరెక్టర్ ఆనంద్ మాత్రం చాలా చాలా కూల్ గా ఈ కామెంట్ ని తీసుకున్నారు . ఒక స్మైల్ ఎమోజితో అతడికి రిప్లై ఇచ్చాడు . దీంతో వెంటనే ఆ నెటిజన్ క్షమించమని కోరారు . దానికి ఆనంద్ షాకింగ్ రిప్లై ఇచ్చాడు . పర్లేదు అది కూడా నిజమే కదా అంటూ చాలా కూల్ గా ఈ మ్యాటర్ ని సాల్వ్ చేశాడు . ప్రజెంట్ దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్ గా మారాయి..!!