టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆ దమ్మున్న హీరోలు ఈ ఇద్దరే.. మిగతా వాళ్ళు ఆటలో అరటిపండ్లే..!

సినిమా ఇండస్ట్రీలో హీరోలకి కొదవలేదు.. చాలామంది హీరోలు ఉన్నారు . కొత్త హీరోలు పుట్టుకొస్తున్నారు . నాన్న పేర్లు తాతలు పేర్లు చెప్పుకొని ఇండస్ట్రీలో రాజ్యమేలుస్తున్న వాళ్ళు ఉన్నారు. అయితే అలా బ్యాగ్రౌండ్ సపోర్ట్ చూసుకొని వచ్చిన వాళ్ళందరూ స్టార్ హీరోలుగా పాన్ ఇండియా హీరోలుగా మారుతారు అన్న నమ్మకం లేదు . జనాల మైండ్ సెట్ కూడా మారింది. టాలెంట్ ఉన్న హీరోనే యంకరేజ్ చేస్తున్నారు. రీసెంట్గా పాన్ ఇండియా హీరోలుగా పాపులారిటీ సంపాదించుకున్న టాలీవుడ్ హీరోలపై కొందరు అభిమానులు ఘాటుగా స్పందిస్తున్నారు.

ఈ మధ్యకాలంలో మన ఇండస్ట్రీలో పెద్దగా చెప్పుకోతగ్గ సినిమాలు ఏవి రాలేదు అన్ని ..లవ్ ట్రాక్ .. లవ్ డ్రామాలు ఈ విధంగానే వచ్చాయి. అయితే ఇండస్ట్రీలో అసలు సిసలైన హీరోలు అంటే మాత్రం బన్నీ – మహేష్ బాబు అంటున్నారు జనాలు . దానికి కారణాలు కూడా చెప్పుకు వస్తున్నారు. రియల్ హీరో అంటే ఎలాంటి సాహసమైనా చేయాలి. ఎలాంటి పాత్రలు అయినా పోషించగలగాలి.. పుష్ప సినిమాలో బన్నీ ఏకంగా అండర్వేర్ తో కనిపిస్తాడు . అలాంటి సాహసం మన ఇండస్ట్రీలో ఉండే ఏ హీరో చేయడు .. చేయలేడు .

అందుకే బన్నీ రియల్ హీరో అంటూ చెప్పుకొస్తున్నారు. అంతేకాదు రీసెంట్గా గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు లుంగీ కట్టి మాస్ డాన్స్ చించేశాడు. గతంలో ఎప్పుడూ కూడా మహేష్ బాబు ఈ విధంగా చేయలేదు అంతేకాదు చాలామంది హీరోలు స్టార్ స్టేటస్ వచ్చాక పాన్ ఇండియా పాపులారిటీ సంపాదించుకున్నాక ..ఇలా లుంగీ కట్టరు . కానీ మహేష్ బాబు మాత్రం హీరో అంటే ఎలాంటి పాత్రలైనా చేయాలి అంటూ తాను నమ్మిన పాత్ర కోసం కష్టపడ్డాడు . అందుకే ఈ ఇద్దరి హీరోలను బాగా పొగిడేస్తున్నారు జనాలు. మిగతా వాళ్ళు క్రేజ్ పాపులారిటీ దక్కించుకున్న అందరూ పైపై నటన వరకే అని .. రియల్ హీరోస్ అంటే ఈ ఇద్దరి అని చెప్పుకొస్తున్నారు. కొందరు ఆటలు అరటి పండ్లు మిగతా హీరోలు అంటూ ట్రోల్ చేస్తున్నారు..!!