స్టార్ డైరెక్టర్ భార్య పై ఫైర్ అయినా కంగనా.. కారణం ఇదే..

బాలీవుడ్ ఫైర్‌ బ్రాండ్ కంగనాకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో కూడా ప్రభాస్ హీరోయిన్గా మంచి పాపులారి దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. సినిమాల్లో కంటే కాంట్రవర్షల్ బ్యూటీగా ఎక్కువ పాపులర్ అవుతూ వస్తుంది. ఇక తాజాగా డైరెక్టర్ విధు వినోద్ చోప్రా భార్య అనుపమ చోప్రా పై ఫైర్ అవుతూ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అనుపమ లాంటి వాళ్ళు ఇండస్ట్రీకి చాలా ప్రమాదకరం అంటూ చెప్పుకొచ్చిన ఆమె.. తన భర్త ఫేమ్ వాడుకుని క్రిటిక్‌గా చలామణి అవుతుందని.. ఆమె నిజమైన టాలెంట్ ఉన్న వారిని ఇండస్ట్రీకి రాకుండా అడ్డుపడుతుందని.. బాలీవుడ్ గాసిప్ గ్యాంగ్ తో కలిసి ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్నవారి ఎదుగుదలను తొక్కేస్తుందని కామెంట్స్ చేసింది.

అసలు కంగనా ఈ హాట్ కామెంట్స్ ఎందుకు చేసింది అనే విషయానికి వస్తే.. 12th ఫెయిల్ సినిమా చూడడానికి థియేటర్స్ కు ఎవరు రారని తన భార్య ప్రముఖ సినీ క్రిటిక్‌ అనుపమ చోప్రా చెప్పినట్లు డైరెక్టర్ విధు వినోద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. దీనిపై కంగనా స్పందిస్తూ ఆమెకు తెలివైన అమ్మాయిలు అంటే జలస్.. అందుకే తన భర్తను చూసి కూడా అసూయ పడుతుంది. అందులో పెద్ద ఆశ్చర్యం లేదు అంటూ స్పందించింది. మొత్తానికి విధు డైరెక్టర్ భార్యపై కంగనా విమర్శలు బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

కంగనా తీరుపై ముంబైకి చెందిన ప్రముఖ న్యాయవాది కేసు నమోదు చేశాడు. మీడియా జనాలను తప్పుదోవ‌ పట్టించడంలో.. అలాగే ప్రముఖులపై అసత్య ప్రచారాలు చేయడంలో కంగనా ముందుంటుంది అంటూ ఆయన ఫిర్యాదు చేశాడు. గతంలో కంగనా చేసిన పలు కామెంట్స్ పై దేశ వ్యాప్తంగా సినీ తారలు కూడా అప్పట్లో బాగా నెగిటివ్గా స్పందించారు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీకి వైరస్ గా కంగనా ఉందంటూ ఆమెపై తీవ్ర ఆరోపణలు చేశారు. కాని కంగనా మాత్రం అవేవి ప‌ట్టించుకొకుండా త‌న దారిలోనే వెళ్ళుతుంది.