“ఎందుకో తెలియదు అది చూసినప్పుడల్లా ఆ ఫీలింగ్ వస్తుంది”.. ఉపాసన నోట నుండి అన్ ఎక్స్పెక్టెడ్ మాటలు(వీడియో)..!

చాలామంది అంటుంటారు ఆడపిల్లలకు తండ్రి అంటే ఇష్టమని .. మగ పిల్లలకు తల్లి అంటే ఇష్టం ఉంటుంది అని ..అయితే ఉపాసన రీసెంట్గా అదే విషయంపై కామెంట్ చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మెగా కోడలు ఉపాసన రీసెంట్గా ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే . ఉపాసన చాలా రేర్ గా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటుంది . అలా ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడే తనకు సంబంధించిన విషయాలను జనాలు తెలుసుకోగలరు .

రీసెంట్ ఇంటర్వ్యూలో ఉపాసన చాలా కాన్ఫిడెంట్గా చాలా ఓపెన్ గా అన్ని చెప్పుకు వచ్చేసింది . ఇదే క్రమంలో క్లింకార గురించి హోస్ట్ ప్రశ్నించగా ..ఉపాసన చాలా ఎమోషనల్ అయిపోయింది.” తను మా లైఫ్ లోకి రావడం ఎంతో అదృష్టంగా ఫీల్ అవుతున్నాము అంటూ ఎమోషనల్ గా స్పందించింది “. అంతేకాదు ఉపాసన క్లింకారకు వాళ్ళ డాడీ అంటే ఇష్టమా ..?మమ్మీ అంటే ఇష్టమా..? అన్న ప్రశ్నకు ఉపాసన సమాధానమిస్తూ ..”తను డాడీ పార్టీ ..నేను తనతో ఎంత టైం స్పెండ్ చేసిన సరే వాళ్ళ డాడీ రాగానే కళ్లని బ్లింక్ చేస్తుంది. చేతులు పైకి ఎత్తుకొని ఆడించమంటూ అల్లరి చేస్తుంది ..ఆ విషయంలో క్లింకార ఫుల్ గా నాన్నకి సపోర్ట్”.

“చరణ్ అంటే చాలా చాలా ఇష్టం.. చరణ్ కూడా క్లింకారతో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. క్లింకార అలా వాళ్ల నాన్నను చూసి కళ్ళు ఎగరేసినప్పుడు నాకు ఎందుకు జలసీగా అనిపిస్తుంది. నేను తనతో ఎంత టైం స్పెండ్ చేస్తున్నా సరే క్లింకారా వాళ్ళ నాన్నకే ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటుంది ” అంటూ చాలా క్యూట్ గా ఎమోషనల్ గా తల్లి ప్రేమను బయటపెట్టింది ఉపాసన. నిజానికి ఉపాసన నోటి నుండి జలసి అన్న పదం మనం ఇప్పటివరకు వినలేదు . ఫస్ట్ టైం వింటున్నాం. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది..!!