బాలయ్య సినిమాలో మెగాస్టార్ కొడుకు.. అసలు సిసలకు క్రేజీ కాంబో ఇదే..

ప్రస్తుతం నందమూరి నట‌సింహం బాలకృష్ణ.. బాబీ డైరెక్షన్లో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని సీతార‌ ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలు వ్యవహరిస్తున్నారు. ఎన్బికె 109 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో బాలయ్యతో బాలీవుడ్ యాక్టర్ బాబి డియోల్ విలన్ గా తలపడనున్నాడు. ఇక ఈ సినిమా కోసం మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కొడుకు.. దుల్కర్ సల్మాన్ ను కూడా రంగంలోకి దింపాడు బాబి.

ఈ సినిమాల్లో దుల్కర్ సల్మాన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడట. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ స‌ర‌గంగా జరుగుతుంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దుల్క‌ర్, బాల‌య్య మ‌ధ్య స‌న్నీవేశాల‌ షూట్ జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఇటీవ‌ల దుల్క‌ర్ టాలీవుడ్‌లో భారీ క్రేజ్ దక్కించుకుంటున్నాడు. ఓ పక్క హీరోగా నటిస్తూనే.. మరో పక్క సపోర్టింగ్ రోల్స్ లో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఈ సినిమా కాకుండా తెలుగులో లక్కీ భాస్కర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు దుల్కర్. ఇక దిల్కర్ హీరోగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఇప్పటికే బాబీ.. చిరుతో వాల్తేరు వీర‌య్య‌ లాంటి హిట్ అందించాడు. అలాంటి మాస్ స్టోరీ తోనే బాలయ్య సినిమాను మొదలుపెట్టాడు. ఇది ఊరమాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ జోనల్లో తెరకెక్కుతుందని సమాచారం. అంతేకాదు స్టార్ కాస్టింగ్‌ను ఈ సినిమాలో దింపడంతో సినిమాపై మరింత హైప్ పెరిగింది. త్వరలోనే సినిమా టైటిల్ మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. మరి ఈ సినిమాతో బాలయ్య మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటాడో లేదో వేచి చూడాలి.