అంతమంది తిడుతున్న ..వేణు స్వామీ చేత ఆషూరెడ్డి పూజలు చేయించుకుంది అందుకే.. అసలు నిజం తెలిస్తే కన్నీళ్ళు తప్పవు..!!

వేణు స్వామి.. ఇండస్ట్రీలో స్టార్ హీరో – హీరోయిన్ – డైరెక్టర్ కి ఎంత పబ్లిసిటీ పాపులారిటీ ఉంటుందో అంతకు డబల్ కాదు త్రిపుల్ స్థాయిలో క్రేజ్ సంపాదించేసుకున్నాడు . స్టార్ సెలబ్రిటీస్ ల జీవితాలలో జరగబోయే విషయాలను ముందుగానే చెప్పేసే వేణు స్వామి నయనతార – తమన్నా – రష్మిక మందన్నా- ప్రభాస్ – సమంత – పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోస్ హీరోయిన్స్ జాతకాలను బయటపెట్టేసాడు .

మరీ ముఖ్యంగా ప్రభాస్ గురించి ఆయన చేసిన కామెంట్స్ రెబల్ అభిమానులను ఏ రేంజ్ లో హర్ట్ చేసాయో మనకు తెలిసిందే . రీసెంట్గా వేణు స్వామి జూనియర్ సమంతగా పాపులారిటీ సంపాదించుకున్న ఆషూ రెడ్డి చేత ప్రత్యేక పూజలు చేయించారు . దీనికి సంబంధించిన వీడియో ఆషూ రెడ్డి సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది . గతంలో ఓసారి కారు కొనుక్కున్నప్పుడు పూజా కార్యక్రమాలతో వేణు స్వామి దగ్గర కనిపించిన ఆషూ రెడ్డి .. ఇప్పుడు ఏకంగా ఇంటికి పిలిపించుకొని మరి ప్రత్యేకంగా పూజలు చేయించుకుంది .

పూజ అనంతరం వేణు స్వామి ఆమెను ఆశీర్వదించారు . మెడలో దండ వేసి ఆమెను బ్లెస్ చేశారు . ఆషూ రెడ్డి కూడా ఆయన పాదాలకు నమస్కరించింది . దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. జనరల్ గా అందరూ కూడా వేణు స్వామి చేత పూజలు చేయించుకునేది ఆఫర్ల కోసమేనని ..ఆషూ రెడ్డి కూడా ఆఫర్ల కోసమే ఇలా వేణు స్వామిని నమ్ముకుంది అని జనాలు చర్చించుకుంటున్నారు. అయితే ఆషూ రెడ్డి పూజలు చేయించుకుంది ఆఫర్స్ కోసం కాదని .. ఆమె కు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని.. వాటి నుంచి బయటపడడానికి ఇలా శాంతి పరిహార పూజలు చేయించుకుంది అని.. ఆషూ రెడ్డి పైకి నవ్వుతూ కనిపిస్తున్న వెనక మాత్రం ఆమెకి చాలా బాధలు ఉన్నాయని అవి తెలిస్తే కన్నీళ్లు తప్పవు అంటున్నారు ఆమె అభిమానులు..!!