బిగ్ బ్రేకింగ్: ‘ బేబీ ‘ మూవీ కథ నాదేనంటూ పోలిసుల‌కు పిర్యాదు.. డైరెక్టర్, ప్రొడ్యూసర్లపై కేసు న‌మొదు..

బేబీ మూవీ స్టోరీ నాదే నంటూ హైదరాబాదులో రాయదుర్గం పోలీసులకు షార్ట్ ఫిలిం డైరెక్టర్ సినిమాటోగ్రాఫర్ శిరిన్ శ్రీరామ్ కేసు పెట్టాడు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో నటించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ బేబీ సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సాయి రాజేష్ ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా తెరకెక్కించినా.. ఈ సినిమా బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకుని కలెక్షన్‌ల వర్షం కురిపించింది.

Baby' Twitter review: Here is how Netizen's reacted to Anand Deverakonda's  heart-wrenching love story

అయితే ఈ కథను కొన్నేళ్ళ క్రితమే డైరెక్టర్ సాయి రాజేష్‌కు నేను చెప్పానంటూ శిరిన్‌ శ్రీరామ్ తాజాగా వివరించాడు. కాపీరైట్స్ చట్టాన్ని వాళ్ళు ఉల్లంఘించారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 2013లో తనకు సినిమాటోగ్రాఫర్ గా పని చేయాలంటూ డైరెక్టర్ సాయి రాజేష్.. శిరిన్ శ్రీరామ్‌ను కోరినట్లు చెప్పుకొచ్చాడు. ఆయనతో పరిచయం ఏర్పడినట్లు చెప్పిన శ్రీరామ్.. 2015లో కన్నా ప్లీజ్ టైటిల్ తో ఓ కథను రాసుకున్నానని.. పోలీసులకు వివరించాడట.

Baby director gets 'Bro' shoe as gift for the producer - News -  IndiaGlitz.com

ఇక ఆ కథకు ప్రేమించొదు అనే టైటిల్ పెట్టుకుని డైరెక్టర్ సాయి రాజేష్ సూచనలతో నిర్మాత ఎస్ కే ఎన్ కు వివ‌రించాడ‌ట శ్రీ‌రామ్. ఇదే కథను కొన్నాళ్ల తర్వాత 2023లో బేబీ టైటిల్ తో తెరకెక్కించడం.. ఈ సినిమా దర్శకుడుగా సాయి రాజేష్, నిర్మాతలుగా ఎస్ కే ఎన్, ధీరాజ్‌లు వ్యవహరించడం జరిగింది. ఇక బేబి స్టోరీ మొత్తం తను ప్రేమించొద్దు స్టోరీనే అంటూ శిరిన్ శ్రీరామ్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.