ఆ విషయాని దాచి పెట్టి.. బన్నీ అభిమానులను డీప్ గా హర్ట్ చేసిన సుకుమార్..!

బన్నీ.. ప్రెసెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా పుష్ప2. ఈ సినిమాపై ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయో మనకు తెలిసిందే . గతంలో తెరకెక్కిన పుష్ప వన్ సినిమాకి సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్నా నటిస్తూ ఉండగా.. ఐటమ్ సాంగ్ లో దిశా పటానీ నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది . ఈ సినిమాకి సంబంధించిన ఏ అప్డేట్ రిలీజ్ అయిన సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది.

రీసెంట్గా పుష్ప2 సెట్స్ నుంచి లీకైన కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఫ్యాన్స్ కు కొత్త టెన్షన్ పుట్టిస్తున్నాయి . ఈ ఫొటోస్ లో బన్నీ ఒంటినిండా గాయాలతో ఉండడం గమనార్హం. కాళ్ల దగ్గర నుంచి పాదాలు, తొడలు, ముఖం , చేయి భాగం , మోచేయి అంతా కూడా భారీ భారీ గాయాలయ్యాయి. ఆ గాయాలు ఫోటోకి కూడా క్యాప్చర్ అయ్యాయి అంటే ఒరిజినల్గా అవి ఎంత పెద్ద గాయాలో అర్థం చేసుకోవచ్చు.

ఈ క్రమంలోనే బన్నీను బాగా టార్చర్ చేసేస్తున్నాడు సుకుమార్ అంటూ ప్రచారం జరుగుతుంది . అంతేకాదు బన్నీ కి గాయాలు అయిన విషయాన్ని దాచిపెట్టి సుకుమార్ పెద్ద తప్పు చేశాడని అభిమానులు ఈ విషయంలో డీప్ గా హార్ట్ అయ్యారు అని కామెంట్స్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో ప్రజెంట్ బన్నీ గాయాలకు సంబంధించిన పిక్చర్స్ వైరల్ అవుతున్నాయి. కాగా భారీ బడ్జెట్ తో భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న పుష్ప2 సినిమా ఆగస్టు 15వ తేదీ 2024వ సంవత్సరంలో గ్రాండ్గా థియేటర్స్ లో పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాతో మరో ఆస్కార్ ఇండియాకి రావడం పక్కా అంటున్నారు అభిమానులు..!!