దట్ ఈజ్ మెగాస్టార్.. చైనా స్కూల్‌లో చిరంజీవి కోసం స్టూడెంట్ ఏం చేసిందో చూడండి.. వీడియో వైరల్..!

మెగాస్టార్ చిరంజీవి .. టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరికీ ఆయన ఒక ఇన్స్పిరేషన్.. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ లోకి రావడమే కాకుండా .. ఆయన పేరుని మారు మ్రోగి పోయేలా చేసుకున్నారు. అంతేకాదు ఆయన ఇండస్ట్రీలో సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతలు ఎన్నో …నార్మల్ స్థాయి దగ్గర నుంచి ఒక హీరోగా .. ఆ తర్వాత స్టార్ హీరోగా ..ఆ తర్వాత మెగాస్టార్ గా మారడం మామూలు విషయం కాదు . అందుకే చాలామంది మెగాస్టార్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇండస్ట్రీలోకి వస్తూ ఉంటారు.

అయితే పొరుగు దేశం చైనాలో మెగాస్టార్ చిరంజీవి స్టోరీని ఇన్స్పిరేషన్ గా ఒక స్టూడెంట్ వివరించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకొని చాలామంది పలు రంగాలలో సక్సెస్ అయ్యారు . అయితే ఇక్కడ ఈ చిన్నారి చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకొని.. ఆయనలా అందరూ స్వయంకృషితో ఎదగాలి అంటూ ఒక స్టూడెంట్ చైనాలోని స్కూల్లో ఆయన స్టోరీని వివరిస్తుంది. చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకొని ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగిన వాళ్లలో ఎంతోమంది ..వాళ్లలో ఒకరే డాన్స్ కొరియోగ్రాఫర్ కొణీతల విజయ్ .

అనకాపల్లికి చెందిన ఈ డాన్స్ మాస్టర్ చిరంజీవి డాన్సులు చూస్తూ ఎదిగి ఆయానను స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు ఇంటర్నేషనల్ డాన్స్ కొరియోగ్రాఫర్ గా మారారు. రియాల్టీ షోస్ కూడా ఆయన వర్క్ చేశారు . థాయిలాండ్ లో కొరియోగ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకున్న విజయ్ ..కొంతమంది మిత్రులు ఆహ్వానంతో చైనా వెళ్లారు ..అక్కడ టీవీ ఛానల్స్ లో కొరియోగ్రాఫర్ గా మంచి స్థాయిని అందుకున్నారు . ప్రస్తుతం చైనాలో ఆయన పేరు ఉన్న పెద్ద కొరియోగ్రాఫర్ .. ఆయన కూతురే ఇప్పుడు చిరంజీవి స్టోరీ ఇన్స్పిరేషన్ గా చెప్పింది . విజయ్ కుమార్ కూతురు అయిన ఆ స్టూడెంట్ తండ్రి విజయానికి స్ఫూర్తిదాయకమైన చిరంజీవి స్టోరీను స్కూల్లో స్టోరీల వివరించి తన అభిమానాన్ని చాటుకుంది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది…!!