ఊహించని మాటతో..పవన్ కళ్యాణ్ పరువు తీసేసిన యాంకర్.. ఫ్యాన్స్ కి ఎక్కడో మండుతుందిగా..!

కొద్దిరోజులే .. కేవలం మరికొద్ది రోజుల్లోనే .. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కాబోతున్నాయి . ఇప్పటికే పొలిటికల్ హీట్ పెరిగిపోయింది . అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీపై నిందలు వేయడం ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీపై చురకలు అంటించడం మనం చూస్తూనే ఉన్నాం. ఈసారి ఎలక్షన్స్ చాలా డిఫరెంట్ . టిడిపి – జనసేన మింగిల్ అవ్వడంతో వైసిపి ఈసారి దారుణంగా ఓడిపోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . ఇలాంటి క్రమంలోనే సినీ స్టార్స్ కూడా పాలిటిక్స్ పై ఒక కన్ను వేశారు . ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పొలిటికల్ హీట్ పెంచేస్తున్నారు.

రీసెంట్ గా ఇండస్ట్రీలో హాట్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న స్రవంతి చొక్కరపు చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింత వైరల్ గా మారాయి . మనకు తెలిసిందే .. స్రవంతి మొదటి నుంచి పవన్ కళ్యాణ్ కి బిగ్ ఫ్యాన్ . ఈ విషయాన్ని ఆమె స్వయాన పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. అంతేకాదు తన కొడుకు పేరుని కూడా అఖీరాగా పెట్టింది. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పి పవన్ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేసింది. పవన్ కళ్యాణ్ దేవుడని.. దేవుడు లాంటి వాళ్ళు ఒకరే ఉండాలి అని.. అందుకే ఆయన కొడుకు పేరు పెట్టుకున్నాను అంటూ చాలా ఎమోషనల్ గా స్పందించింది .

దీంతో స్రవంతి పవన్ కళ్యాణ్ కి బిగ్ ఫ్యాన్ అంటూ అందరికీ అర్థం అయిపోయింది . అయితే రీసెంట్గా ఆయన చేసిన ఒక పోస్ట్ నెట్టింట సంచలనంగా మారింది . స్రవంతి యాత్ర 2 సినిమా చూసింది . చూసింది చూసినట్లు ఎంజాయ్ చేసి కామ్ గా వెళ్లకుండా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో యాత్ర 2 పై రివ్యూ ఇస్తూ ..”ఏంటి జగనన్న ..ఇంత మొండితనం నీకు.. మీరు కూడా థియేటర్స్ కి వెళ్లి యాత్ర 2 చూసి జగన్ మొండితనాన్ని గెలుపుని ఎంజాయ్ చేయండి “అంటూ పవన్ ఫ్యాన్స్ కు మండేలా పరోక్షంగా ఘాటైన పోస్ట్ పెట్టింది .

ఇది ఆమె ఏ ఉద్దేశంతో పెట్టిందో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మాత్రం మండేలా అనిపిస్తుంది. అందుకే ఆమె అకౌంట్ ని అన్ బ్లాక్ చేయండి అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . అంతేకాదు డబ్బులు తీసుకొని ఈ విధంగా ప్రచారం చేస్తుంది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు . మొత్తానికి స్రవంతి బాగానే పొలిటికల్ మాయలో ఇరుక్కునేసింది..!!