అయ్యయ్యో..పాపం.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐశ్వర్య రాయ్ కి దారుణమైన అవమానం..!!

ఒకప్పుడు ఇండస్ట్రీలో అందాల ముద్దుగుమ్మ ఎవరు అంటే అందరూ కళ్ళు మూసుకుని టక్కున చెప్పే పేరు ఐశ్వర్యారాయ్. అందానికి మరో మారుపేరుగా ఐశ్వర్యరాయ్ పేరును పొగిడేసేవారు. ఒక అమ్మాయి అందాన్ని పొగడడానికి ఐశ్వర్య రాయ్ని వాడేవారు. అలాంటి అరుదైన ఘనత దక్కించుకుంది. మన ఇండస్ట్రీలోని చాలామంది స్టార్ హీరోస్ కూడా ఐశ్వర్యరాయ్ కి బిగ్ ఫ్యాన్స్ . ఒక్క సినిమాలోనైనా ఆమెతో నటించాలి అంటూ ఎంతోమంది ఆశపడ్డారు. కానీ తెలుగు హీరోలలో ఆ ఘనత అందుకున్న ఏకైక వ్యక్తి నాగార్జున .

రావోయి చందమామ సినిమాలో ఒక పాటలో మెరిసి అభిమానులను మెప్పించింది . ఆ తర్వాత పలు ఆఫర్స్ వచ్చిన తెలుగు సినిమాలను రిజెక్ట్ చేసింది. అయితే రీసెంట్గా టాలీవుడ్ స్టార్స్ మాత్రం ఐశ్వర్య
రాయ్ తో ఇప్పుడు సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు . ఆమె భారీగా బరువు పెరిగిపోవడం .. ఒకప్పటిలా ఫిజిక్ ని మెయింటైన్ చేయలేకపోవడం .. చూడడానికి అంతగా ఆకర్షణీయంగా కనిపించకపోవడం అందుకు కారణం అంటూ తెలుస్తుంది .

అంతేకాదు పాన్ ఇండియా లెవల్లో స్టేటస్ సంపాదించుకున్న హీరోస్ హీరోయిన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు . ఒకప్పుడు ఐశ్వర్య రాయ్ ఫేవరెట్ బ్యూటీనే అయినా సరే ఇప్పుడు మాత్రం ఆమెతో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు . మొన్నటికి మొన్న టాలీవుడ్ లో రెండు సినిమాలు వచ్చినట్లు వచ్చి చేయి జారిపోయాయి . ఐశ్వర్య రాయి మా సినిమాలో హీరోయిన్గా వద్దు అంటూ మేకర్స్ కి డైరెక్ట్ గా చెప్పేసారట స్టార్ హీరోలు. ఇది ఆమెకు ఘోర అవమానం అంటున్నారు అభిమానులు..!!