ప్రశాంత్ వర్మ లేడీ ఓరియంటెడ్ సినిమా.. ‘ సూపర్ ఉమెన్ ‘ గా ఆ హీరోయిన్.. అసలు ఊహించలేరు..

ఇండస్ట్రీలో ఎంతమంది కొత్త డైరెక్టర్లు వస్తూ ఉంటారు. తనకంటూ స్టార్ట్ డ‌మ్ క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వారిలో యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఒకడు. మొదట నాని ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన అ! సినిమాతో డైరెక్ట‌ర్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రశాంత్ వర్మ.. ఈ సినిమాతో హిట్ కొట్టి ప్రేక్షకుల్లో పాజిటివ్ టాక్ ను దక్కించుకున్నాడు. ఈ సినిమాతో డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమాలో తెర‌కెక్కిస్తాడనే పేరు ప్రశాంత్ వర్మ కు వచ్చింది. అలాగే ఈ సినిమాకు నేషనల్ అవార్డ్‌ కూడా లభించింది. అలాంటి సబ్జెక్టు ఉన్న సినిమాలు ఏవి మరోసారి రాలేదు కూడా. ఇక ఈ మూవీ తర్వాత రాజశేఖర్ క‌ల్కి మూవీ తెర‌కెక్కించాడు.

ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది. తర్వాత తేజ సజ్జ హీరోగా జాంబిరెడ్డి సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో రిలీజై పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఇక రీసెంట్గా మరోసారి తేజ సజ్జ‌ హీరోగా హనుమాన్ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమాలతో పోటీపడి మరి బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఇక ప్రస్తుతం ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ తో బిజీగా ఉన్నాడు. సినిమాటిక్ యూనివర్స్ పేరుతో కొన్ని సినిమాలు తెర‌కెక్క‌నున్నట్లు గతంలోనే ప్రకటించాడు. హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ మాత్రమే కాదు.. మరో లేడీ ఓరియంటెడ్ సినిమాకు కూడా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించనున్నాడు.

ఇందులో హీరోయిన్ ఎవరు అంటూ ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలయింది. కాగా ఈ సినిమాకు క్రాక్, దూత లాంటి సిరీస్ లలో హీరోయిన్గా నటించిన జ్ఞానేశ్వరి కండ్రేగుల ప్రధాన పాత్రలు నటిస్తుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు చూడాలి. ఇటీవల జ్ఞానేశ్వరి ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ప్రశాంత్ వర్మ తనతో సినిమా చేస్తున్నాడు అంటూ వివరించింది. అంటే ఈ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాల్లో జ్ఞానేశ్వరి నటిస్తుందంటూ టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ కావడంతో ఏంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలో సూపర్ ఉమెన్ గా జ్ఞానేశ్వరిని తీసుకుంటున్నారా అసలు ఊహించలేకపోతున్నాం అంటూ అంతా షాక్ అవుతున్నారు.