ఓరిఓరి..ఈ సినిమాలో ఇక్కడ కనిపిస్తుంది ఆ స్టార్ హీరోనా..? అస్సలు గెస్ చేయలేముగా..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ వార్త అయినా సరే ఇట్టే ట్రెండ్ అయిపోతుంది . అభిమానులకి గూస్ బంప్స్ తెప్పించేస్తుంది . కాగా సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో చాలామంది స్టార్ సెలబ్రిటీస్ చైల్డ్ హుడ్ లో నటించిన సినిమా ఫొటోస్..చైల్డ్ హుడ్ లో వాళ్ళు యాడ్ చేసిన పిక్స్ ట్రెండ్ చేస్తున్నారు . తాజాగా ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని అబ్బాయ్ కి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి.

ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని అబ్బాయి మరెవరో కాదు విశ్వక్ సేన్. ఎస్ స్వయానా ఈ విషయాన్ని ఆయనే వెల్లడించాడు. గతంలో చాలా సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆఫర్ వచ్చాయట. కానీ కొన్ని సినిమాలు చేతికి వచ్చినట్లే వచ్చి చేజారి పోయాయట. ఫైనల్లీ దాసరి నారాయణరావు నిర్మాణంలో జగపతిబాబు హీరోగా చేసిన బంగారు బాబు సినిమాకి సెలెక్ట్ అయ్యాడట . అప్పుడు దిల్ సుఖ్ నగర్ లో ఉండేవాళ్ళట .

ఫస్ట్ టైం ఆ ఇంటికి వ్యాన్ వచ్చి ఎక్కించుకొని రామోజీ ఫిలిం సిటీకి తీసుకెళ్లిందట . అదే ఫస్ట్ టైం ఆయన రామోజీ ఫిలిం సిటీ కూడా చూడడం అట . ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పటికీ మర్చిపోలేను అంటూ చెప్పుకొచ్చారు . ఈ ఫోటో చూసి అభిమానులు షాక్ అయిపోతున్నారు . భలే ముద్దుగా ఉన్నావే అస్సలు గుర్తుపట్టలేకపోతున్నాము అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రజెంట్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద యంగ్ హీరోగా విశ్వక్సేన్ ముందుకు వెళ్తున్నాడు . త్వరలోనే ఆయన నటించిన మంచి మంచి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి..!