బిగ్ బాస్ షో పై అమర్ దీప్ భార్య తేజస్విని సన్సేషనల్ కామెంట్స్.. టార్చర్ చూసానంటూ..

బిగ్ బాస్ సీజన్ 7 లో బుల్లితెర నటుడు అమర్‌దీప్ కు ఎంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అదే రేంజ్ లో నెగెటివిటీ కూడా మూటగట్టుకున్నాడు. ఈ సీజన‌న్‌లో ఫస్ట్ హాఫ్ లో అమర్‌దీప్ ఇండిపెండెంట్గా ఆడలేదని.. యాక్టివ్గా లేడంటూ ఎన్నో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అసలు అమర్ కనీసం టాప్ పైకి చేరతాడో లేదో అని సందేహాలు కూడా చాలామందిలో మొదలయ్యాయి. కానీ సెకండ్ హాఫ్ లో ఎక్టివ్ అయ్యిన అమ‌ర్‌ కాస్త హద్దులు మీరి గోల చేశాడు. అయితే అతనికి అది ప్లస్ అయిందని చెప్పవచ్చు. ఫలితంగా శివాజీని వెనక్కి నెట్టి మరీ ర‌న‌ర‌ప్‌గా నిలిచాడు. హౌస్ నుంచి అమర్ బయటకు వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు అందరూ చూశారు. అయితే హౌస్ లో అమర్ ఉన్నప్పుడు బయట అతనిపై వచ్చిన నెగెటివిటీతో తేజస్విని గౌడ నరకం చూసిందట.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తేజస్విని తమ లవ్ స్టోరీ గురించి వివరించింది. అలాగే బిగ్ బాస్ పై కూడా ఆమె తీవ్ర విమర్శలు చేసింది. అమర్, తేజస్విని 2022లో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. తేజస్విని తమ ప్రేమ కథని చెబుతూ ముందుగా అమర్ ప్రపోజ్ చేశాడని వివరించింది. కోయిలమ్మ టీవీ సీరియల్ టైంలో అమర్ నాకు ప్రపోజ్ చేశాడని.. అంతకుముందు పరిచయం ఉండేది కానీ మేము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే.. తొలిసారి అమర్ ప్రపోజ్ చేసినప్పుడు రిజెక్ట్ చేశా.. లవ్ లాంటివి ఏమీ వద్దు ఫ్రెండ్స్ గా ఉందామంటూ చెప్పేశా.. కానీ వదలలేదు. కొంతకాలం సైలెంట్ గా ఉన్నాడు. మూడేళ్ల తర్వాత మళ్లీ ప్రపోజ్ చేశాడు. అయినా నేను అంత ఈజీగా ఒప్పుకోలేదు. కాస్త టార్చర్ చేశానంటూ వివరించింది. అప్పుడు కూడా నేను యాక్సెప్ట్ చేయలేదు.. వచ్చి మా ఇంట్లో మాట్లాడు.. వాళ్ళు ఒప్పుకుంటే ఓకే.. లేదంటే నన్ను మర్చిపో అని చెప్పానని.. దీంతో అమర్ చాలా బాధపడ్డాడు అంటూ వివరించింది.

మొత్తానికి ఫ్యామిలీ మెంబర్స్ అంతా యాక్సెప్ట్ చేయడంతో.. మా పెళ్లి జరిగిందంటూ వివరించింది. ఇక ప్రస్తుతం భర్త పై తేజస్విని అమితమైన ప్రేమను చూపిస్తుంది. అమ‌ర్ బిగ్ బాస్ కి వెళ్ళినప్పుడు నేను నరకం చూశాను అంటూ వివరించిన తేజస్విని.. అతనిపై నెగెటివిటీ పెరిగిపోతుంటే చాలా బాధగా అనిపించిందని.. ఏం చేసినా నెగిటివ్ గానే హైలైట్ చేసేవాళ్లు. దీంతో లైవ్ చూడాలంటేనే భయం వేసేది అంటూ చెప్పుకొచ్చింది. బిగ్‌బాస్ ని ఓ కర్మల ఫీలయ్యేదాన్ని.. ఎప్పుడు ఇది వదిలి పోతుందా అంటూ వెయిట్ చేశానని చెప్పుకొచ్చింది. తేజస్వి ఇకపై ఏ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ గురించి మాట్లాడకూడదు అనుకుంటున్నా అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.