ఆ సీన్స్ నటించే విషయంలో నా ఒపీనియన్ మార్చుకున్నా.. అనన్యా నాగాళ్ల షాకింగ్ కామెంట్స్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్లేశం మూవీ తో ఎంట్రీ ఇచ్చింది అనన్య నాగుళ్ళ. మొదటి సినిమాతోనే భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్లలో అందుకుంది. పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ప్లే బ్యాక్, వకీల్ సాబ్, మాస్ట్రో, మళ్లీ పెళ్లి లాంటి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. వకీల్ సాబ్ సినిమాతో అన‌న్య‌కు భారీ పాపులారిటీ వచ్చింది అనడంలో సందేహం లేదు. ఇక ఈ సినిమాలలో సత్తా న‌టనతో స‌త్తా చాటిన అనన్యా.. ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తుంది. తంత్రా అనే హారర్ మూవీ తో పాటు పొట్టేలు అనే మ‌రోమూవీలో కూడా అనన్య నటిస్తుంది.

ఇక ఇప్పటికే అనన్య పాండే నటించిన ఈ పొట్టేలు సినిమా నుంచి లిప్ కిస్ సన్నివేశాలు రిలీజ్ అయి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో తంత్ర ట్రైలర్ లాంచ్‌లో పొట్టేల్‌ మూవీ ముద్దు సీన్స్ గురించి ఆసక్తికరమైన క్వశ్చన్ ఎదురైంది. తంత్ర‌ సినిమాలో కూడా ఇలాంటి సన్నివేశాలు ఉంటాయా అని ప్రశ్నించగా.. దానికి అనన్య స్పందిస్తూ పొట్టేలు సినిమాలో ఆ ముద్దు సన్నివేశం చాలా అవసరం అందుకే నటించాల్సి వచ్చింది. ఈ సినిమాలో గ్లామర్, రొమాన్స్, హర్రర్ అన్ని ఉంటాయంటూ వివరించింది.

ప్రతి ఆరు నెలలకు ఒకసారి మనిషి ఆలోచనలో మార్పులు వస్తూ ఉంటాయని.. మార్పు లేకపోతే మన ఎదుగుదల అక్కడితో ఆగిపోతుందని.. అలానే నా కెరీర్ స్టార్టింగ్ లో నేను ఎలా ఉన్నా మంచి పాత్ర‌లే నా దగ్గరికి వస్తాయని భావించే దానిని. నా నటనతో ఆకట్టుకుంటే చాలని భావించే దానిని. కానీ న‌ట‌న అంటే ఇలాంటి బోల్డ్ కంటెంట్ ఉన్న రోల్ లో కూడా నటించడమేనని అర్థం చేసుకోవడానికి కాస్త టైం పట్టింది అంటూ చెప్పుకొచ్చింది. ఇక కథ డిమాండ్ చేస్తే ఎటువంటి బోల్డ్స్ స‌న్నివేశాలు చేయడానికైనా నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటా అంటూ ఆమె వివరించింది.