ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. స్పిరిట్ నుంచి గూస్ బంప్స్ అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగ..

స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఇటీవల యానిమల్ సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గ‌తేడాది చివరిలో రిలీజై భారీ సక్సెస్ అందుకుంది. ఈ సినిమా విషయంలో ఎక్కువగా సందీప్ విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ.. కలెక్షన్ల పరంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక ఈ మూవీతో సందీప్ రెడ్డి వంగకు ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ వ‌చ్చింది. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా పాన్ ఇండియ‌న్ స్టార్ హీరో ప్రభాస్‌తో మరో సినిమాను తెరకెక్కించే పనిలో బిజీ అయ్యాడు. ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాకపోయినా.. స్పిరిట్‌ టైటిల్‌ను మాత్రం ముందే అనౌన్స్ చేశారు మేకర్స్.

ఇక ఈ సినిమాకు సంబంధించిన ఎటువంటి అప్డేట్ బయటకు రాకపోయినా నెట్టింట‌ మాత్రం దీనికి సంబంధించి ఏదో ఒక వార్త తరచూ వైరల్ అవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో సందడి చేశాడు సందీప్. ఈ ఈవెంట్లో సందీప్ మాట్లాడుతూ స్పిరిట్ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం నేను ప్రభాస్ హీరోగా రూపొందించబోతున్న స్పిరిట్ సినిమా పనుల్లో బిజీగా ఉంటున్నానని.. అందరూ అనుకునే విధంగా ఇది హారర్ మూవీ కాదంటూ వివరించాడు. ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా ప్రభాస్ కనిపించబోతున్నాడని.. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయంటూ చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతానికి ఫీల్డ్ వ‌ర్క్ జ‌రుగుతుంద‌ని ఇప్ప‌టికైతే ఇంతవరకు మాత్రమే అప్డేట్ ఇవ్వగలన‌ని సందీప్ రెడ్డి వివరించాడు. ప్రస్తుతం ఆయన ఇచ్చిన అప్డేట్స్ నెటింట‌ వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇప్పటివరకు ప్రభాస్ పోలీస్ గెటప్ లో కనిపించిందో లేదు. దీంతో ఎప్పటి నుంచో డార్లింగ్‌ను పోలీస్ గెటప్‌లో చూడాలని ఫ్యాన్స్ అంతా తెగ ముచ్చట పడుతున్నారు. ఇక సందీప్ రెడ్డి ఇది ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ స్టోరీ అని చెప్పడంతో వారి ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. ఇక‌క త్వరగా షూటింగ్ పూర్తి చేసి సినిమా అప్డేట్స్ రిలీజ్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కామెంట్స్ రూపంలో తన అభిప్రాయాన్ని షేర్ చేస్తున్నారు.