“సినిమా అయినా ఆపేసేయ్..ఆ పని మాత్రం చేయకు చరణ్.. దండం పెడతాం”.. మెగా హీరోకి ఫ్యాన్స్ స్పెషల్ రిక్వెస్ట్..!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తమ స్టార్ హీరోకి ఉన్న విషయాన్ని ఓపెన్ గా చెప్పడానికి ఇష్టపడుతున్నారు . తమ ఫేవరెట్ హీరో సినిమాలో ఏ హీరోయిన్ ఉండాలి..? ఏ హీరోయిన్ ఉండకూడదు ..? ఏ హీరోయిన్ తో సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.. అన్న విషయాన్ని ఓపెన్ గా చెప్పేస్తున్నారు . రీసెంట్గా సోషల్ మీడియాలో అదే న్యూస్ మరోసారి వైరల్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ త్వరలోనే బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాను సెట్స్ పై కి తీసుకెళ్లబోతున్నారు .

ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ జాన్వి కపూర్ ని హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారట. ఇది అఫీషియల్ న్యూస్ కాదు.. జస్ట్ వైరల్ అవుతున్న న్యూస్ మాత్రమే. దీనిపై అటు చరణ్ కానీ ఇటు బుచ్చిబాబు సనా కానీ ఏ విధంగా అఫీషియల్ ప్రకటన చేయలేదు. అయితే ఫాన్స్ మాత్రం ఫుల్ ఫైర్ అయిపోతున్నారు . ఆ బ్యూటీ మా హీరో సినిమాలో వద్దు మార్చేయండి అంటున్నారు. అంతేకాదు చరణ్ కి స్ట్రైట్ గానే చెప్పేస్తున్నారు.

” నువ్వు సినిమా నైనా ఆపేసేయ్..పర్లేదు.. జాన్వి కపూర్ ని మాత్రం హీరోయిన్ గా పెట్టుకోవద్దు ..ఆమె అసలు వద్దనే వద్దు అంటూ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు”. మొదటినుంచి ఎందుకో జాన్వి కపూర్ అంటే తెలుగు జనాలకు పెద్దగా నచ్చడం లేదు. ఎన్టీఆర్ సినిమాల్లో ఆమె హీరోయిన్గా సెలెక్ట్ అయినప్పుడు కూడా ఇదే విధంగా ట్రోలింగ్ చేశారు . ఇప్పుడు మరోసారి చరణ్ విషయంలో కూడా అదే విధంగా స్పందిస్తున్నారు..!!