అఫీషియల్ : త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న టాలీవుడ్ యంగ్ బ్యూటీ.. ఎంగేజ్మెంట్ పిక్స్ వైరల్..

ప్రస్తుతం పెళ్లిల సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ సెల‌బ్రిటీల ద‌గ్గ‌ర నుంచి సామాన్య జనం వరకు చాలామంది వివాహ బంధంతో ఒక‌టౌతున్నారు. అలా తాజాగా సినీ ఇండ‌స్ట్రీకి చెందిన స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు ఐశ్వర్య నిశ్చితార్థం జ‌రిగింది. అలాగే సీనియర్ నటుడు విజయ్ కుమార్ మనవరాలి పెళ్లి కూడా ఘ‌నంగా జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా టాలీవుడ్ కు చెందిన మరో యువ నటి కూడా త్వరలోనే పెళ్లి పీట‌లెక్క‌డానికి రెడ్డీ అవుతుంది.

ఇటీవల ఆమె ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. అయితే ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా.. రాజావారు రానివారు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన దివ్య. ఈ సినిమా తర్వాత దివ్య హిట్ 2, ఆర్ఎక్స్ 100, బెదురులంక, అద్భుతం లాంటి సినిమాల్లో సహయ పాత్రలో నటించి మెప్పించింది. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు బుల్లితెరపై డ్యాన్స్ షోలలోను యాంకరింగ్ చేస్తూ సందడి చేస్తుంది.

ఇక ఈ బ్యూటీ తాజాగా నిశ్చితార్థ వేడుకలను ఘనంగా జరుపుకుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన ఇన్‌స్టా వేదికగా స్టోరీ రూపంలో షేర్ చేసుకుంది. దీంతో ఈమెకు తోటి నటులతో పాటు సన్నిహితులు శుభకాంక్షలు తెలియజేస్తున్నారు.