“ఇక పై సినిమా చేయాలంటే అది తప్పనిసరి”..క్రేజీ కండీషన్స్ పెడుతున్న శ్రీలీల..!

టైం ఎప్పుడు ..? ఎవరికి..? ఎలా మారిపోతుందో ఎవ్వరు చెప్పలేరు . అప్పటివరకు స్టార్ గా ఉండొచ్చు . కేవలం ఒకే ఒక్క సినిమాతో తుస్సుమంటూ దిగజారి పోవచ్చు . గ్రాఫ్ పడిపోవచ్చు .. అప్పటివరకు జయహో అన్న జనాలే ఛీ ఛీ అని కూడా కొట్టొచ్చు . అలాంటి సిచువేషన్స్ ఇండస్ట్రీలో మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. పాపం అలాంటి లిస్టులోకే వచ్చేసింది అందాల ముద్దుగుమ్మ శ్రీలీల . నిన్న మొన్నటి వరకు ఈ బ్యూటీ ని అందరు టాలీవుడ్ చరిత్రను సృష్టించి.. తిరగరాయబోయే అదృష్ట దేవత అనుకున్నారు .

ఎలాంటి ఫ్లాప్ హీరోలైనా సరే ఆమె తమ సినిమాలో నటిస్తే హిట్టు కొట్టేస్తుంది అన్న ధీమా వ్యక్తం చేసేసారు. సీన్ కట్ చేస్తే ఒక్క సినిమాతో ఫేట్ మారిపోయింది . ఆమె నటించిన గుంటూరు కారం సినిమా ఆమెకు హ్యూజ్ నెగిటివ్ టాక్ తెచ్చుకునేలా చేసింది . అయితే రీసెంట్గా శ్రీ లీల తన వద్దకు వస్తున్న డైరెక్టర్ కు క్రేజీ కండిషన్స్ పెడుతుందట . ఇన్నాళ్లు సినిమా కథ విషయంలో పెద్దగా ఆలోచించకుండా ..

పెద్ద హీరో అయితే ఓకే.. చిన్న హీరో అయితే నో కాల్ షీట్స్ ఖాళీగా ఉంటే ఏ సినిమా అయినా ఓకే అనే విధంగా ఇచ్చేస్తూ వచ్చిందట. కానీ ఇప్పుడు మాత్రం అలా చేయడం లేదట .కధ పూర్తిగా విని కచ్చితంగా సినిమాలో కథలు ఆమె పాత్ర ప్రాముఖ్యత ఉంటేనే సినిమాకి ఓకే చేస్తుందట . లేకపోతే ఐదు కోట్లు ఇచ్చినా సరే రిజెక్ట్ చేసేస్తుందట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!
!