వాట్ : లోకేష్ కనగరాజ్ కూడా కాపీ క్యాటేనా.. అడ్డంగా దొరికిపోయాడే..?!

ఇటీవల కాలంలో సౌత్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా భారీ పాపులారిటీ దక్కించుకున్న వారిలో లోకేష్ కనగ‌రాజ్‌ కూడా ఒకడు. ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో ఇలా వరుస సినిమాలను తెరకెక్కించి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ సక్సెస్ లను సొంతం చేసుకున్నాడు. అన్ని సినిమాలు కమర్షియల్ హిట్లుగా నిలవడమే కాదు.. ఒక సినిమాటిక్ యూనివర్స్‌ క్రియేట్ చేయడంలోను లోకేష్ కనగ‌రాజ్‌ సక్సెస్ సాధించాడు. ఈ యూనివర్స్‌లో ఎన్నో సినిమాలు వస్తాయి అంటూ ఇప్పటికే లోకేష్ కనగరాజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈయన ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్‌తో ఓ సినిమాను తీసేందుకు రెడీ అవుతున్నాడు.

మరో పక్క కమలహాసన్‌తో విక్రమ్ సీక్వెల్స్ చేయడానికి స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నాడు. అలాగే ఖైదీ సీక్వెల్ ని కూడా ప్లాన్ చేస్తున్నాడు లోకేష్. ఇన్ని సినిమాలను చేసేందుకు రెడీ అవుతున్న ఈ యంగ్ డైరెక్టర్‌కు.. కాపీ క్యాట్ అంటూ విమ్మ‌ర్శ‌లు మీడియాలో చక్కెరలు కొడుతున్నాయి. విజయ్‌తో మూడు సంవత్సరాల క్రితం లోకేష్ తెరకెక్కించిన మాస్టర్ సినిమా మలయాళం మూవీ ముద్రాకి కాపీ అంటూ కొంతమంది నేటిజన్స్ ప్రూఫ్ తో సహా సోషల్ మీడియాలో ఈ వార్తను వైరల్ చేస్తున్నారు. ముద్ర మూవీలో బాల నేరస్థుల జైలుకు హీరో సూపర్‌వైజర్‌గా ఉంటాడు. అక్కడ జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేస్తూ ఉంటాడు.

ముద్ర లోని దాదాపు అన్ని సన్నివేశాలను మక్కికి మక్కి అన్నట్లుగా లోకేష్ దించేసాడంటూ.. మరికొన్ని సినిమాలకు సంబంధించిన సన్నివేశాలను కూడా ఈ సినిమాల లోకేష్ వాడేస్తాడంటూ.. నెట్టింట విమర్శలు ఎదురవుతున్నాయి. మొత్తానికి టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న లోకేష్ కనగ‌రాజ్‌ కూడా కాపీ క్యాట్ అంటూ ముద్ర పడిపోయింది. ఈ విషయాన్ని ఆయన ఫ్యాన్స్ అసలు జీర్నించుకోలేకపోతున్నారు. చాలా స్పష్టంగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో కొందరు నిరూపిస్తూ వీడియోలు పక్కపక్కన పెట్టి మరీ చూపిస్తుండడంతో.. అంత ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయంపై లోకేష్ కనగ‌రాజ్‌ ఎలా రియాక్ట్ అవుతాడో వేచి చూడాలి.