రకుల్ పెళ్లి చేసుకుంటున్న గోవా రిసార్ట్ ఒక్కరోజు రెంట్ ఎంతో తెలుసా..? సామాన్యులు 100 పెళ్లిళ్లు చేసుకునేసేయచ్చు..!

రకుల్ ప్రీత్ సింగ్ ..టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ మరికొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతుంది. రకుల్ ప్రీత్ సింగ్ గోవాలోని లగ్జరీ హోటల్లో పెళ్లి చేసుకోబోతుంది . దీనికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్ని పూర్తయిపోయాయి . గోవాలోని ఐటిసి గ్రాండ్ హోటల్లో రకుల్ జాకీల వివాహం మూడు రోజులపాటు ఘనంగా అంగరంగ వైభవంగా జరగబోతుంది . ఈ వివాహానికి అతి కొద్ది మంది బంధువులు – స్నేహితులు మాత్రమే హాజరవుతున్నారు అంటూ తెలుస్తుంది .

కాగా రకుల్ పెళ్లి చేసుకోబోతున్న గోవాలోని ఐటిసి గ్రాండ్ రిసార్ట్ హోటల్ తాలూకా వివరాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి . సుమారు 45 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ హోటల్లో మొత్తం 246 గదులు ఉంటాయట . చుట్టూ చల్లటి కొబ్బరి చెట్ల వాతావరణం అతి ప్లస్ పాయింట్ . మేక్ మై ట్రిప్ ప్రకారం ఈ హోటల్ లో ఒక్క గది ధర 19 వేల రూపాయల నుంచి 75 వేల రూపాయల వరకు ఉంటుందట .

ఇందులో కొన్ని పన్నులు కూడా ఉన్నాయి . గోవాలోనే అత్యంత లగ్జరీ హోటల్ అయిన ఈ రిసార్ట్ లో రకుల్ – జాకీల పెళ్లి జరగబోతున్నట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి . ఫిబ్రవరి 19 నుంచి ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయట . పెళ్లి కోసం అమ్మడు కోట్లలోనే ఖర్చు పెడుతుందట. దీంతో సామాన్యుల అయితే ఏకంగా 100 పెళ్లి చేసుకునేయొచ్చు అంటూ జనాలు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు..!!