సుమ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు రాజీవ్ కనకాల అలాంటి పనులు చేసేవాడా..? 25 ఏళ్ల తర్వాత అసలు నిజం బయటపెట్టిందిగా..!!

సుమ .. ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోయిన్ కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో అంతకు డబల్ కాదు.. ట్రిపుల్ రేంజ్ లో పబ్లిసిటీ పాపులారిటీ సంపాదించుకుంది . రీసెంట్గా తన భర్తతో కలిసి ఆమె యూట్యూబ్ ఛానల్ ఫ్యాన్స్ కోసం వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న రాజీవ్ కనకాల – సుమ ఫిబ్రవరి 10వ తేదీన పెళ్లిరోజును ఘనంగా జరుపుకున్నారు. వాళ్ల పెళ్లి అయ్యి 25 ఏళ్లు దాటింది . ఈ శుభసందర్భంగా వృద్ధాశ్రమంలో సుమ- రాజీవ్ చక్కగా పెద్దవాళ్లతో గడిపారు. అనంతరం తమ యూట్యూబ్ ఛానల్ లో ఉన్న సబ్స్క్రైబర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు . ఇదే వీడియోని షేర్ చేసుకునింది సుమ.

ఈ కార్యక్రమంలో సుమా-రాజీవ్ ఇద్దరు పర్సనల్ విషయాలను పంచుకున్నారు . పెళ్లయిన కొత్తల్లో భార్య కోసం సమయం కేటాయించాలి అని రాజీవ్ కనకాల సూచించారు. అవును పార్టనర్ కి ఎక్కువ సమయం కేటాయించాలి ..పిల్లలు పుట్టాక బాధ్యతలు కూడా తీసుకోవాలి అంటూ తెలిపింది సుమ . మీ భార్యకు తెలియకుండా ఎప్పుడైనా ఫోన్ చెక్ చేశారా అని ఓ సబ్స్క్రైబర్ అడిగిన ప్రశ్నకు రాజీవ్ లేదు అని సమాధానం చెబుతాడు . సుమని అడిగితే మాత్రం “ఎస్” ఒక్కసారి అంటూ నవ్వుతూ అసలు విషయాన్ని బయట పెట్టేసింది . దీంతో రాజీవ్ కనకాల షాక్ అవుతాడు .

కానీ అందులో ఏమీ దొరకలేదు అంటూ ట్విస్ట్ ఇచ్చింది సుమ . దొరికేలా ఎందుకు పెడతాం అంటూ సెటైర్ వేశాడు రాజీవ్ కనకాల . అంతేకాదు అందరి ముందు సుమకి సారీ చెప్తాడు రాజీవ్ కనకాల .ఎప్పుడు అడిగినా ఐదు నిమిషాల్లో వచ్చేస్తా అని చెబుతాడు అని.. కానీ రాడు అని సుమ బాధపడింది . దానికోసం రాజీవ్ కనకాల క్షమాపణలు కోరాడు . భర్త సారీ చెప్పగానే సుమ తెగ ఎంజాయ్ చేసింది . అయితే రాజీవ్ కనకాల తనని మరో విషయంలో కూడా బాధపెట్టాడు అని చెప్పుకొస్తుంది సుమ . రాజీవ్ ఎక్కువగా దెయ్యాలు – హర్రర్ కంటెంట్ ఉన్న సినిమాలే చూస్తాడట. తాను ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో కూడా అలాంటి సినిమాలే చూపించి భయపెట్టాడు అని బాధపడిపోయింది . ప్రజెంట్ వీళ్ళకి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది..!!

 

 

View this post on Instagram

 

A post shared by Suma Kanakala (@kanakalasuma)