ఆ హీరోతో ఎఫైర్ పై ..మెగా కోడలు లావణ్య త్రిపాఠి సెన్సేషనల్ కామెంట్స్..!!

సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం .. ఎప్పుడు ..ఎవరిపై ..ఎలాంటి గాసిప్స్ .. రూమర్స్ వైరల్ అవుతాయో ఎవరు చెప్పలేరు . కాగా అలాంటి రూమర్స్ పై కొందరు స్పందిస్తూ ఉంటారు .కొందరు స్పందించకుండా తప్పించుకుంటూ ఉంటారు. రీసెంట్ గా తనపై వచ్చిన అతి పెద్ద బ్యాడ్ రూమర్ పై స్పందించింది లావణ్య త్రిపాఠి. మెగా ప్రిన్స్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె నటించిన వెబ్ సిరీస్ మిస్ పర్ఫెక్ట్ . ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా లావణ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పెళ్లికి ముందు ఎఫైర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది .

“సినీ ఇండస్ట్రీ అంటే ఒకరిని లవ్ చేస్తారు.. బోర్ కొట్టగానే విడాకులు తీసుకొని బ్రేకప్ చెప్పుకొని మరొకరితో లవ్ లో పడతారు .. సాధారణంగా అందరూ ఇలాగే అనుకుంటారు ..కానీ అది తప్పు అందరూ అలాగే ఉండరు ..రకరకాల పుకార్లు పుట్టడానికి కారణం ఇదే ..సెలబ్రెటీగా జీవితం అందరూ అనుకున్నట్టు ఒకేలా ఉండదు ..సినీ పరిశ్రమకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఒకే మైండ్ సెట్ తో ఉండరు.. అది గుర్తుపెట్టుకోవాలి”..

” నేను మిస్టర్ సినిమా షూటింగ్ సమయంలో వరుణ్ తేజ్ తో స్నేహం ఏర్పడే వరకు ఏ అబ్బాయి పైన అలాంటి ఫీలింగ్స్ కలగలేదు.. అప్పుడే మేమిద్దరం ప్రేమలో పడ్డాం .. షూటింగ్ ఎండింగ్లో రోజ్ తో నాకు ప్రపోజ్ చేశాడు ” అంటూ సిగ్గుపడుతూ చెప్పుకొచ్చింది లావణ్య త్రిపాఠి . కాగా పెళ్లికి ముందు లావణ్య త్రిపాఠి ఓ హీరోతో ప్రేమాయణం నడిపింది అంటూ అప్పట్లో వార్తలు వినిపించేవి. రీసెంట్గా అదంతా ఫేక్ అంట కొట్టి పడేసింది లావణ్య..!!