నిజమైన రాజు అంటే ఇతడే.. ఉప్పలపాటి ప్రభాస్ రాజు తీసుకున్న నిర్ణయానికి సినీ మేకర్స్ హ్యాట్సాఫ్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . మనకు తెలిసిందే రెబెల్ కుటుంబం ది రాజుల వంశం . ఉప్పలపాటి ప్రభాస్ ది రాజుల వంశమే . అందుకే ఆయన నీ అభిమానులు కొంతమంది ముద్దుగా ఉప్పలపాటి ప్రభాస్ రాజు అంటూ పిలుచుకుంటూ ఉంటారు . రీసెంట్గా ప్రభాస్ కి సంబంధించిన ఒక న్యూస్ నెట్టింత వైరల్ గా మారింది . ప్రభాస్ తాజాగా ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది . ఈ నిర్ణయం సినీ మేకర్స్ కి చాలా నచ్చేసింది .

జనరల్ గా ఏ స్టార్ హీరో అయిన హీరోయిన్ అయినా సినిమాకి కమిట్ అయ్యాడు అంటే అప్పటినుంచి వాళ్ళ షూటింగ్లో స్పెండ్ చేస్తే ఖర్చులు మొత్తం నిర్మాతలే భరించాల్సి వస్తుంది . అయితే ప్రభాస్ మాత్రం అలా కాకుండా రెమ్యూనరేషన్ ఒక్కటే తీసుకొని షూటింగ్స్ లో ఖర్చు అయ్యే డబ్బులు తానే పెట్టుకుంటూ వస్తున్నాడు . అయితే ఇకపై ప్రతి సినిమాకి కూడా ఇదే విధంగా చేయాలి అని నిర్ణయం తీసుకున్నాడట ప్రభాస్.

ప్రభాస్ తన పారితోషకం మినహా నిర్మాత నుంచి అదనంగా ఒక్క రూపాయి కూడా ఆశించరట . తన స్టాఫ్ తన బౌన్సర్లు అందరికీ ప్రభాసే అన్ని సమకూరుస్తూ వస్తాడట. అంతేకాదు ప్రభాస్ సినిమాలో చేసిన నటీనటులకు కూడా ఫుడ్ ఆయనే ఇంటి నుంచి స్పెషల్ గా వండించి తీసుకొస్తారట. బయట నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టనివ్వడంట . ఇలా ఇండస్ట్రీలో ఏ హీరో లేడు అని ప్రభాస్ ఒక్కడే ఉన్నాడు అని అందుకే ప్రభాస్ రాజు అని .. నిజమైన రాజుల వంశం ఇదే విధంగా ఉంటుంది అని చెప్పుకొస్తున్నారు..!!