ప్రభాస్ పై ఇంత చెత్త పనికిమాలిన రూమరా..? సిగ్గు లేదా రా మీకు..? కోపంతో ఊగిపోతున్న రెబల్ ఫ్యాన్స్..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎలాంటి వార్తలు మనం వింటున్నామో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ పై ఫేక్ వార్తలు ఎక్కువగా మనం వినాల్సిన పరిస్థితి వచ్చింది. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో ప్రభాస్ పై ఎలాంటి రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం . నిన్న మొన్నటి వరకు హీరోయిన్ అనుష్క శెట్టితో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు .. త్వరలోనే పెళ్లి అంటూ ప్రచారం జరగక ఇప్పుడు ఆ హీరోయిన్స్ స్థానాన్ని మార్చేశారు కొందరు ఆకతాయిలు .

త్వరలోనే మాల్దీవ్స్ లో హీరోయిన్ కృతి సనన్ తో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ప్రచారం చేస్తున్నారు . ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . దీంతో సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు . మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రభాస్ పెళ్లి చేసేస్తారా? పని పాట లేదా ..?అంటూ ఫైర్ అవుతున్నారు. మరికొందరు కడుపుకి అన్నం తింటున్నారా..? అంటూ రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ప్రభాస్ మాత్రం ఈ వార్తల పై సైలెంట్ గా చూసి చూడన్నట్లు వెళ్లిపోతున్నాడు. ప్రజెంట్ ప్రభాస్ పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ముందుకు వెళ్తున్నాడు. త్వరలోనే కల్కి – రాజా సబ్ సినిమాలతో మన ముందుకు రాబోతున్నాడు. చూద్దాం మరి ఈ సినిమాలు ఎలాంటి హిట్ అందిస్తాయో ప్రభాస్ కి.. ప్రసెంట్ ఆయన పెళ్ళి వార్త అభిమానులకి కడుపు మండిపోయేలా చేస్తుంది..!!