రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన రష్మిక వార్తలపై.. నేషనల్ క్రష్ క్రేజీ కౌంటర్..

నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రస్తుతం టాలీవుడ్ బిజీయ‌స్ట్‌ బ్యూటీగా దూసుకుపోతోంది. స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ టాప్ పాన్ ఇండియా సినిమాల్లో కూడా హీరోయిన్గా క్రేజ్‌ను సంపాదించుకుంటుంది. చివరిగా యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి క్రేజ్ ను అమాంతం పెంచేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. మొదట పుష్పా సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఇక ఒక్కసారిగా ఈ రెండు పాన్ ఇండియా సినిమాలు సక్సెస్ సాధించడంతో రష్మిక రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది.

అయినప్పటికీ రష్మిక ఆటిట్యూడ్ పరంగా డౌన్ టు ఎర్త్ అన్నట్లుగానే ఉంటుంది. అందుకే ఆమెకు నేషనల్ క్రష్ గా క్రేజ్ వచ్చింది. ఇక యానిమల్ సక్సెస్ తర్వాత ఈ అమ్మడు భారీగా పారితోషికాన్ని పెంచేసిందని.. ఆ ముందు సినిమాకు మూడు కోట్లు తీసుకునే రష్మిక.. ఇప్పుడు నాలుగు కోట్ల వ‌ర‌కు డిమ్యాండ్ చేస్తుందంటూ వార్తలు ఇటీవల తెగ చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై స్పందించిన రష్మిక సోషల్ మీడియాలో పోస్ట్ కి ఫన్నీ రిప్లై ఇస్తూ ఆశ్చర్యాన్ని తెలియజేసింది.

Image

ఆమె రియాక్ట్ అవుతూ ఎవరు చెప్పారు ఈ విషయం.. నిజంగా నేను ఆశ్చర్యపోతున్న. ఇవన్నీ చూసిన తర్వాత నేను నిజంగా దీని గురించి ఆలోచించాలి. ఈ విషయాన్ని నిర్మాతలు ముందు పెడితే ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఏం చేయను సార్.. మీడియా అలా చెబుతోంది నేను కూడా వారి మాటలకు కట్టుబడి ఉండాలని భావిస్తున్న అంటూ రిప్లై ఇచ్చినట్లు ఫన్నీగా, కాస్త క్రేజీగా రియాక్ట్ అయింది క్రష్మిక.