విడాకులు తీసుకున్న మరో సెలబ్రిటీ జంట.. 12 ఏళ్ల కాపురానికి స్వస్తి..

బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ హేమమాలిని కూతురు యాక్టర్ ఈషా డియాలో అభిమానులకు బాడ్ న్యూస్ చెప్పింది. తన భర్త త‌క్తానీతో విడిపోతున్నట్లు అధికారం గా అనౌన్స్ చేసింది. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు కారణంగానే ఈ నిర్ణ‌యం తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆమె ఈ విషయాన్ని కన్ఫామ్ చేసేసింది. మేమిద్దరం 12 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెప్తున్నాం.. పరస్పర అంగీకారంతోనే విడిపోవడానికి సిద్ధమయ్యాం.

Esha Deol And Bharat Takhtani's Baby's Day Out With Daughter, Radhya, Her  Pregnancy Glow Is Evident

పిల్లలు మాత్రం మా ఇద్దరికీ చాలా ఇంపార్టెంట్ అంటూ రాసుకొచ్చింది. దీంతో ఆమె అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. బాలీవుడ్ స్టార్ కపుల్ ధర్మేంద్ర, హేమమాలిని పెద్ద కూతురు ఈషా. తల్లి లాగే ఈమె కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. 21 ఏళ్ల వయస్సులో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈషా డియాలో అన్ని భాషల్లో 30కి పైగా సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే మణిరత్నం డైరెక్షన్లో తెరకెక్కిన యువ మూవీలో సూర్య జంటగా నటించి మెప్పించింది.

Esha Deol Pens A Cryptic Note Amid Divorce Rumours With Bharat, 'Sometimes  You Got To Let Go...'

ఈ సినిమా తర్వాత ఆమెకు తెలుగు, తమిళ అభిమానులు మరింతగా పెరిగారు. అనంతరం 2012లో భరత్ తక్తానీని వివాహం చేసుకొని మూడేళ్లు నటనకు బ్రేక్ ఇచ్చింది. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టాక ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తూ బిజీ అయిపోయింది. ఇక డిజిటల్ ఓటీటీలు రావడంతో.. ఈషా కూడా ఓటీటీలో రీఎంట్రీ ఇచ్చి ఆకట్టుకుంటుంది. గత కొన్నేళ్లుగా భరత్ – ఈషాల మధ్య ఏవో మనస్పర్ధలు తెలుపుతున్నాయని.. ఇరు కుటుంబాలు ఎంత సద్ది చెబుతామని చూసినా అది వర్కవుట్‌కావడం లేదని.. దీంతో విడాకులు తీసుకుని విడిపోతున్నట్లు తెలుస్తుంది.