‘ బేబీ ‘ రీమేక్ లో శ్రీదేవి కూతురు.. ‘ అర్జున్ రెడ్డి ‘ రీమేక్ టార్గెట్ చేస్తున్న మేకర్స్..

టాలీవుడ్ లో కల్ట్‌ లవ్ స్టోరీ గా భారీ క్రేజ్‌ను సంపాదించుకుంది బేబీ. బోల్డ్ కంటెంట్ తో ట్రెండీ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఆనంద్ దేవ‌రకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో మెప్పించారు. ఈ జనరేషన్ యూత్ కి కనెక్ట్ అయ్యేలా సినిమా ఉండడంతో ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చిన భారీ సక్సెస్ అందుకుంది బేబీ. దాదాపు రూ.100 కోట్ల వసూళ్లను కొల్లగొట్టిన ఈ మూవీని హిందీలో, తమిళంలో రీమేక్‌ చేస్తున్నట్లు ఇటీవల నిర్మాత ఎస్ కే ఎన్ వివరించాడు.

SKN feels proud to be the producer of Baby Thank You meet?

మాతృక డైరెక్టర్ సాయి రాజేష్ అక్కడ కూడా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ టైటిల్ గా కల్ట్‌ బొమ్మ అనే టైటిల్ ని పెట్టే ఆలోచనలో ఉన్నామని ఇప్పటికే ఈ టైటిల్‌ని చాంబర్లో రిజిస్టర్ చేయించినట్లు వివరించారు. హిందీలో స్టార్ కిడ్స్ తో గాని కొత్త వాళ్లతో.. బేబీ రీమేక్ చేయాలనుకుంటున్నట్లు.. అర్జున్ రెడ్డి ఇక్కడ కంటే హిందీలో హ్యూజ్ గా కలెక్షన్లను కొల్లగొట్టింది. బేబీ కూడా బాలీవుడ్ లో ఆ రేంజ్ కలెక్షన్లు తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నాం అంటూ వివరించారు.

Baby producer gifts a Benz car to director Sai Rajesh - Telugu News -  IndiaGlitz.com

బాలీవుడ్ రీమేక్ లో ఇంట్రెస్టింగ్ నేమ్స్ చాలా వినిపిస్తున్నాయట‌.. ఇందులో శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ పేరు కూడా వినిపిస్తుందట. ఆమెను టీం కన్సిడర్ చేస్తుందని తెలుస్తోంది. దీంతోపాటు స్టార్ హీరో కొడుకుని హీరోగా లంచ్ చేయబోతున్నట్లు సమాచారం. అయితే ఇలా స్టార్ కిడ్స్‌తో వెళ్ళాల‌.. లేదా పేరున్న యూట్యూబ్ స్టార్స్‌.. లేదా స్టార్ హీరోల‌ను తీసుకోవాలా అనేది ఆలోచిస్తున్నట్లు వివరించాడు. త్వరలో దీనిపై క్లారిటీ క్లారిటీ వస్తుందని చెప్పారు. అయితే ఖుషి కపూర్ పేరు బలంగా వినిపిస్తుంది.