పవన్ ఫాన్స్ కు పండగ చేసుకునే న్యూస్.. ఓజీ రిలీజ్ అప్పుడే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరుకు టాలీవుడ్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో రిలీజ్ అయింది అంటే థియేటర్స్ వద్ద ఎలాంటి హంగామా ఉంటుందో అందరికీ తెలుసు. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలేవి ఆయన రేంజ్ కు తగ్గట్టుగా హిట్ పడలేదు.

Pawan Kalyan OG Storm In September | cinejosh.com

ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్, సుజిత్ డైరెక్షన్లో ఓజి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ పవర్ ఫుల్ గ్యాంగ్ స్ట‌ర్‌గా కనిపించబోతున్నాడు. పవన్ జంటగా ప్రియాంక అరుణ్ మోహన్ కనిపించనుంది. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ ప్రతి నాయకుడుగా కనిపిస్తాడు. థ‌మన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలను నెలకొన్నాయి.

Pawan Kalyan's 'OG' Receives Official Title Confirmation | Pawan Kalyan OG  Receives Official Title Confirmation

మాఫియా నేపథ్యంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో పవన్ ఎప్పుడూ చూడనంత వైల్డ్ గా కనిపించబోతున్నాడని టాక్. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ పోస్టర్ తోనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేసిన మేకర్స్ తాజాగా సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ మూవీ సెప్టెంబ‌ర్‌ 27న ప్రేక్షకుల ముందుకు వస్తుందంటూ వివరించారు. ఈ సినిమాకు డివివి దానయ్య ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.