రూట్ మార్చిన బోయపాటి.. ఆ క్రేజీ హీరోతో మూవీ ఫిక్స్.. చరిత్ర తిరగరాయబోతున్నాడుగా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ డైరెక్టర్ అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది బోయపాటి శ్రీను . బోయపాటి శ్రీనులా మాస్ డైరెక్షన్లో సినిమాలు మరి ఏ డైరెక్టర్ కూడా తెరకెక్కించలేడేమో అని అంటూ ఉంటారు అభిమానులు . రీసెంట్ గా బోయపాటి శ్రీను తెరకెక్కించిన స్కంద సినిమా డిజాస్టర్ గా మారింది . ఈ సినిమా పరమ చెత్త రికార్డును కొల్లగొట్టింది. దీంతో బోయపాటి శ్రీను ని బాగా ట్రోల్ చేశారు జనాలు .

అయితే అలాంటివి పెద్దగా పట్టించుకోని బోయపాటి శ్రీను తనలోని టాలెంట్ ను బయట పెట్టడానికి బన్నీతో సినిమాకి కమిట్ అయ్యాడు అంటూ వార్తలు వినిపించాయి. ఈ సినిమాను అల్లు అరవింద్ ప్రొడ్యూస్ చేయబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. అంతేకాదు సూర్యతో కూడా ఒక సినిమాకి కమిట్ అయ్యాడు అంటూ ప్రచారం జరిగింది . అఖండ 2 ఆల్రెడీ బాలయ్యతో కమిట్ అయి ఉన్నాడు బోయపాటి శ్రీను.

అయితే ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఓ క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. బోయపాటి శ్రీను విజయ్ దేవరకొండ తో ఓ సినిమాకి ఫిక్స్ అయ్యాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కాంబో చరిత్ర తిరగరాయబోతుంది అంటూ ఫ్యాన్స్ చెబుతున్నారు . రౌడీ హీరో చాలా నాటి .. బోయపాటి ఊర నాటు మాస్ . మరి ఇద్దరి కాంబోలో సినిమా అంటే రచ్చ రంబోలాగా మారిపోదు.. ఫాన్స్ ఈ కాంబో కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..!!