అమ్మ దొంగ..జాన్వీకి తెలుగులో అవకాశాలు రావడం వెనుక ఆ స్టార్ హీరో హస్తం ఉందా..? వెరీ నాటీ..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న జాన్వీ కపూర్ ఓ బడా హీరో రిఫరెన్స్ తో తెలుగులో అవకాశాలు అందుకుంటుందా..? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తుంది . జాన్వి కపూర్ స్టార్ హీరోయిన్ శ్రీదేవి ముద్దుల కూతురు అన్న విషయం మనకు తెలిసిందే. బాలీవుడ్లో పలు సినిమాల ద్వారా క్రేజ్ పాపులారిటీ దక్కించుకున్న ఈ బ్యూటీ ..

టాలీవుడ్ లో దేవర సినిమా ద్వారా ఎంట్రీ ఇస్తుంది. కేవలం దేవర మాత్రమే కాదు ఆమె ఖాతాలో మరో రెండు బడా ప్రాజెక్టులు కూడా యాడ్ అయినట్లు తెలుస్తుంది . రామ్ చరణ్ బుచ్చిబాబు మూవీ లో కూడా జాన్వీ కపూర్ హీరోయిన్గా సెలెక్ట్ అయిందట . అంతేకాదు అఖిల్ నెక్స్ట్ సినిమాలో కూడా జాన్వి కపూర్ సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అదేవిధంగా విజయ్ దేవరకొండ నటించబోయే సినిమాలోనూ జాన్వి కపూర్ ఛాన్స్ అందుకున్నట్లు తెలుస్తుంది .

దీని అంతటికి కారణం టాలీవుడ్ బడా హీరో అంటూ ప్రచారం జరుగుతుంది . బోనీకపూర్ అంటే మొదటి నుంచి ఇష్టంగా ఈ టాలీవుడ్ హీరో.. శ్రీదేవితో సినిమాలు కూడా చేశాడు . శ్రీదేవి పై ఉన్న అభిమానంతో కూతురికి టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు దక్కేలా చేస్తున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. చూద్దాం మరి ఆ హీరో సపోర్ట్ తో జాన్వీ ఎన్నాళ్లు అవకాశాలు దక్కించుకుంటుందో..?