రష్మికకి అరుదైన గౌరవం.. ఆనందంలో విజయ్ దేవరకొండ ఏం చేశాడో చూడండి.. ప్రేమంటే ఇదే కదా..!

రష్మిక మందన్నా.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. నేషనల్ క్రష్ గా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . పలు సినిమాలతో బిజీబిజీగా ముందుకెళ్తున్న రష్మిక మందన్నా కు అరుదైన గౌరవం దక్కింది. ప్రస్తుతం ఇండియాలో టాప్ పొజిషన్ కి ఎదుగుతున్న వ్యాపారవేత్తలు.. ఆవిష్కర్తలు .. స్టార్స్ కి సంబంధించి ఫోర్బ్స్ ఇండియా ఒక ప్రత్యేక ఆర్టికల్ని ప్రచురించింది. ఈ ఆర్టికల్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి రష్మిక మొదటి స్థానం దక్కించుకునింది .

అంతేకాదు ఈ ఆర్టికల్ కి సంబంధించిన కవర్ పేజీని రష్మిక తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది . తన ఆనందాన్ని తెలియజేసింది . దీనిపై చాలామంది రష్మికకు కంగ్రాట్యులేషన్స్ విషెస్ అందించారు . అయితే రష్మిక జాన్ జిగిడి దోస్త్ అయిన విజయ్ దేవరకొండ ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు . రష్మిక పోస్ట్ ని షేర్ చేస్తూ ఇన్స్టా స్టోరీలో విజయ్ ఇలా రాసుకోచ్చారు .

నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది . ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేరుకున్నావ్. నువ్వు ఇంకా ఎత్తుకు ఎదగాలి అని కోరుకుంటున్నాను అంటూ విజయ్ రాసుకోచ్చాడు. ప్రస్తుతం విజయ్ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. అంతేకాదు వీళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారు అని పెళ్లి చేసుకోబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి . అయితే ఎప్పటికప్పుడు వాళ్ళు మాత్రం ఆ విషయాలను కొట్టి పడేస్తూనే వచ్చారు. కానీ వీళ్ళు ప్రవర్తించే తీరు మాత్రం వీళ్లు లవర్స్ అని పెళ్లి చేసుకుంటారు అని అందరికీ అర్థమయ్యేలా చేస్తుంది. చూద్దాం ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో..?