” ఊరు పేరు భైరవకోన ” మూవీ డిజిటల్ రేట్స్ ను కొనుగోలు చేసిన ప్రముఖ ఓటీటీ సంస్థ..!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ నటించిన మిస్టరీ మూవీ ” ఊరి పేరు భైరవకోన “. విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ నేడు రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా పై నమ్మకంతో ముందుగా ప్రీమియర్ షోస్ ను కొన్నిచోట్ల వేశారు చిత్ర బృందం.

కావ్య మరియు రాజశేఖర్ వంటి వారు ఈ సినిమాలో కీలక పాత్రలు వహించారు. ఎకె ఎంటర్టైన్మెంట్స్ ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. శేఖర్ చంద్ర సంగీతాన్ని అందించిన ఈ మూవీ డిజిటల్ రైట్స్ను తాజాగా ఆహా వీడియో కొనుగోలు చేసిన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇక ఇదే కనుక నిజం అయితే ఈ సినిమా సగం హిట్ కొట్టేసిందనే చెప్పొచ్చు.

ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ సినిమా చూసిన కొందరు ప్రేక్షకులు..” స్టార్ హీరో సినిమాల కంటే ఈ సినిమానే చాలా బాగుంది. మేము ఏదో చిన్న హీరో కనుక అలా అలా చేసేస్తాడు అనుకున్నాం. కానీ తన యాక్టింగ్ కి మేమందరం ఫిదా. సినిమా సూపర్ హిట్ ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.