ఎట్టకేలకు అతడికి ఎస్ చెప్పిన శుభశ్రీ.. సంతోషంలో యువకుడు..!

బిగ్ బాస్ ఉల్టా పుల్టా కార్యక్రమంలో పాల్గొన్న శుభశ్రీ మనందరికీ సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ తన క్యూట్ క్యూట్ మాటలతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. నా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ ఓ డైలాగ్ ని ట్రెండింగ్ లోకి తీసుకొచ్చింది.

ఇక ఈమె బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో గౌతమ్ కృష్ణతో కాస్త చనువుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక వీరందరూ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన అనంతరం కలిసినప్పటికీ శుభశ్రీ గౌతమ్ కి ఒకే చెప్పలేదు. ఇక తాజాగా ఓ వీడియోతో శుభశ్రీ ప్రతి ఒక్కరికి షాక్ ఇచ్చింది.

అతడితో ప్రేమాయణం నడుపుతున్నట్లు వెల్లడించింది. ఇక గౌతమ్ సైతం ఆమెకి రింగ్ పెట్టి మరి ఐ లవ్ యు చెప్పాడు. ఇక దీనికి సుభాష్ శ్రీ సైతం ఓకే చెప్పింది. ఇక అనంతరం వీరిద్దరూ కలిసి కేక్ కట్ చేసి తిన్నారు. ఇక ఇదంతా ‌ ఒక వీడియో కోసమే అయినట్లు తెలుస్తుంది. ఏదేమైనా వీరిద్దరి ఫ్యాన్స్ వీరిద్దరిని ఇలా చూసి సంతృప్తి చెందారు.