శ్రీలీల కి ఉన్న ఆ ఒక్క క్వాలిటీ..పూజా హెగ్డే కి ఉండుంటే..ఇప్పుడు ఈ పరిస్ధితి వచ్చేదే కాదుగా..!!

తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలచిందా..? అన్నట్లు హీరోయిన్గా పూజా హెగ్డే ఏదో అనుకుంటే మరేదో అయ్యింది. నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో అమ్మడు ఎంత టాప్ రేంజ్ లో దూసుకుపోయిందో మనం చూసాం . కానీ ఒక్కసారిగా ఇప్పుడు అమ్మడు క్రేజ్ పడిపోయింది . అంతేకాదు ఆమెను గుర్తుపట్టడానికి కూడా జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు . దానికి కారణం బ్యాక్ టు బ్యాక్ ఆమె ఫ్లాప్లు అందుకోవడమే .

కాగా రీసెంట్గా హీరోయిన్ పూజా హెగ్డేను ట్రోల్ చేస్తున్నారు శ్రీ లీల ఫ్యాన్స్. దానికి కారణం గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆమె మాట్లాడిన మాటలు . గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ శ్రీల స్టేజి పైకి వచ్చి మహేష్ బాబును పొగిడేసిన తీరు అభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకునింది . ఎంతలా అంటే మహేష్ బాబు గురించి ఇంతవరకు ఏ హీరోయిన్ అలా చెప్పలేదు . అంత బాగా మాట్లాడింది.

” మిమ్మల్ని చూస్తూ ఉంటే ఏదో అయిపోతుంది ” అంటూ నాటీ కామెంట్స్ కూడా చేసింది . ఓ రేంజ్ లో కాదు మహా మహా బిస్కెట్లు అన్నీ వేసింది. దీంతో సోషల్ మీడియాలో ఆమె మాట్లాడిన మాటలు ట్రెండ్ అవుతున్నాయి . అంతేకాదు శ్రీ లీలా చేసిన ఈ పని ఇప్పుడు పూజా పాలిట శాపంగా మారింది . అసలు పూజా హెగ్డే ఈ విధంగా మాట్లాడడం నేర్చుకుంటే ఆమెను ఎందుకు సినిమా ఇండస్ట్రీ దూరం పెడుతుంది అని ..శ్రీలీలకు ఉన్న ఆ తెలివి పూజకి లేదని .. అందరికీ క్లోజ్ గా ప్రతి ఈవెంట్ లోను ఏ సినిమా చేస్తే ఆ హీరోని పొగిడేస్తే ఖచ్చితంగా ఆ హీరోయిన్ ఇండస్ట్రీలో పదికాలాలపాటు చల్లగా ఉంటుంది అని శ్రీ లీలాను పొగుడుతూ పూజను ట్రోల్ చేస్తున్నారు జనాలు..!!