ఆ విషయంలో నాకంటే తేజ చాలా సీనియర్.. రానా దగ్గుపాటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ హనుమన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి హైప్‌ నెలకొంది. ఇక సూపర్ హీరో టూర్ పేరుతో ఈ సినిమా ప్రమోషన్స్ గత కొంతకాలంగా జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా హనుమంత్ టీమ్ మొంబై మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో టాలీవుడ్ నటుడు రానా దగ్గుపాటి అతిథిగా హాజరై సందడి చేశాడు.

ఇంద్ర మూవీలో బాలున్నట్టుగా తేజ నటించగా.. అప్పటి నుంచే అతడంటే నాకు చాలా ఇష్టం నేను అతని ఫ్యాన్ అంటూ చెప్పుకొచ్చిన రానా.. రెండున్నరేళ్ళ వయసు నుంచే నటించడం మొదలుపెట్టాడు. ఈ విషయంలో నాకంటే తేజ చాలా సీనియర్ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక హనుమాన్ సినిమా రిలీజ్ కోసం అందరిలాగే నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ వివ‌రించాడు.

ఇక షూటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి సినిమా టీం చాలా యాక్టివ్‌గా ఉంటున్నారని.. ఇది చాలా సంతోషకరమైన విషయం అంటూ చెప్పుకొచ్చిన రానా.. బాలీవుడ్ మీడియాకు తేజ సజ్జను పరిచయం చేశాడు. ఇక ఈ సినిమాకు సంబంధించి పెయిడ్ ప్రీమియర్స్ హైదరాబాద్‌లో ఓపెన్ చేయగా వెంటనే వాటి టికెట్లు క్షణాల్లో సోల్డ్ అవుట్ అయిపోయాయి. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ ఎక్స్ లో పోస్ట్ షేర్ చేసుకుంది. మొత్తం 11 భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.