సినీ చరిత్రలో కని విని ఎరుగని రికార్డ్..మహేశ్ బాబు ‘గుంటూరు కారం’ సంచలనం..!!

గుంటూరు కారం ..గుంటూరు కారం.. గుంటూరు కారం.. చిన్నపిల్లడి దగ్గర నుంచి మంచంలో ఉన్న ముసలివాడి వరకు అందరూ కూడా ఇప్పుడు ఇదే పేరు జపిస్తున్నారు . టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమానే ఈ గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతుంది . ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది.

ఈ క్రమంలోనే సినిమాకి సంబంధించి మంచి బజ్ కూడా క్రియేట్ అయింది . కాగా తెలుగు రాష్ట్రాలలో 90% స్క్రీన్ ఈ సినిమాకి కేటాయించబోతున్నారు . అయితే హైదరాబాద్ మల్టీప్లెక్స్ లో సినిమా అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ప్రసాద్ ఐమాక్స్ ..ఏ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు పొద్దున్నే థియేటర్ బయట భారీ హడావిడి కనిపిస్తుంది. చాలామంది జనాలు సినిమా రిలీజ్ అంటే ప్రసాద్ మల్టీప్లెక్స్ కి వస్తారు . ప్రసాద్ ఐమాక్స్లో ఆరు స్క్రీన్స్ ఉండగా రిలీజ్ రోజు ఆల్మోస్ట్ పెద్ద సినిమా నే అన్ని స్క్రీన్ లకి ఇచ్చేస్తారు .

ఇక గవర్నమెంట్ నుంచి ఎక్స్ట్రా పర్మిషన్ వస్తే తెల్లవారుజామున నుంచి షో స్టార్ట్ చేస్తారు. కాగా ప్రసాద్ ఐమాక్స్లో ఇటీవల సలార్ సినిమా రిలీజ్ రోజు 37 షోలు పడి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది . ఇప్పుడు ఆ రికార్డును మన గుంటూరు కారం బ్రేక్ చేసింది. గుంటూరు కారం సినిమా రిలీజ్ రోజు ఏకంగా 41 షోలు వేయనున్నారు . ఈ విషయాన్ని ప్రసాద్ మల్టీప్లెక్స్ అధికారికంగా ప్రకటించింది . దీంతో గుంటూరు కారం సినిమాకి అర్ధరాత్రి నుంచి హంగామా మొదలవబోతోంది . సినిమా ఇండస్ట్రీలో ఇది ఓ స్పెషల్ క్రేజీ రికార్డ్ అనే చెప్పాలి..!!

 

 

View this post on Instagram

 

A post shared by Prasads Multiplex (@prasadsmultiplx)