ఓరి నీ దుంప తెగ.. గత 10 ఏళ్లుగా అదే వాడుతున్నావా..? ఇదేం కక్కుర్తి రా బాబు..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . ఈ మధ్య కాలంలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు ఎలా వైరల వుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. రీసెంట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి సంబంధించిన ఓ న్యూస్ బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. గత పదేళ్ళుగా అదే షర్ట్ ను వాడుతున్నాడా మన చరణ్ ..?? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది .

మెగా పవర్ స్టార్ అనగానే అందరికీ టక్కున వేలకోట్ల ఆస్తి గుర్తువస్తుంది. కొన్ని వేల కోట్ల ఆస్తికి వన్ అండ్ ఓన్లీ వారసుడు . అంతేకాకుండా అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలని పెళ్లి చేసుకొని అటువైపు నుంచి కూడా ఆస్తులను రాబట్టేసుకున్నాడు . మరి అటు ఇటు ఎటు చూసినా వేల కోట్ల ఆస్తి .. దానికి తగ్గట్టు సినిమాకి 100 కోట్ల రెమ్యూనిరేషన్ అందుకుంటున్నాడు. మరి అలాంటి హీరో రోజుకి కాదు కాదు గంట గంటకి ఒక్కొక్క షర్ట్ మార్చే రేంజ్ ..

మరి అలాంటి హీరో 10 సంవత్సరాలైనా సరే ఒకే షర్ట్ ని తన వద్ద పదిలంగా దాచుకొని మరి అదే వాడుతూ ఉండడం ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . అయితే రామ్ చరణ్ కి ఆ షర్ట్ ఇష్టమని ఆ కారణంగానే అన్నేళ్లు వాడుతూ వస్తున్నాడు అని ..దీనిలో పెద్ద మ్యాటర్ ఏముంది అని జనాలు కౌంటర్స్ వేస్తున్నారు. స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాల గురించి మాత్రమే ఆలోచిస్తారా..?? అంటూ జనాలు మండిపడుతున్నారు . మరికొందరు ఇదేం కక్కుర్తి రా బాబు అంటూ ట్రోల్ చేస్తున్నారు..!!