కోంప ముంచేసిన నయనతార తొందరపాటు.. చిక్కుల్లో విగ్నేశ్ శివన్.. క్రిమినల్ కేసు నమోదు..!?

పాపం విగ్నేష్ శివన్.. ఏది చేసినా సరే అది బెడిసి కొడుతుంది . ఈ మధ్యకాలంలో విగ్నేష్ శివన్ ఎలాంటి చిక్కుల్లో ఇరుక్కున్నాడో మనకు తెలిసిందే. పెళ్లి తర్వాత ప్రశాంతంగానే ఉండలేకపోతున్నాడు . రీసెంట్గా ఆయనకు పెద్ద సంస్థ నోటీసులు జారీ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . తమిళంలో పేరు ఉన్న దర్శకులలో విగ్నేశ్ కూడా కూడా ఒకరు . ఆ విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . నా పేరు రౌడీలాంటి చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నాడు .

కొన్నాళ్ల ముందు హీరోయిన్ నయనతారను పెళ్లి చేసుకున్నాడు . రీసెంట్గా “ఎల్ఐసి” అనే పేరుతో ఒక కొత్త సినిమాను తీయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. ప్రదీప్ రంగనాథ్ -కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన చిత్ర షూటింగ్ త్వరలోనే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఇంతలోనే అడ్డంకులు ఎదురయ్యాయి. ఈ టైటిల్ పై గత కొన్ని రోజులుగా కాంట్రవర్సీలు ఏర్పడుతున్నాయి .

కోలీవుడ్ డైరెక్టర్ కుమారన్ టైటిల్ పై అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాను ఎనిమిదేళ్ల క్రితమే ఈ టైటిల్ రిజిస్టర్ చేసుకున్నాను అని ..ఈ టైటిల్ పై పూర్తి హక్కుల తనవే అని లేకపోతే కోర్టు కి వెళ్తాను అంటూ వార్నింగ్ ఇచ్చారు . ఇప్పుడు ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసి కూడా నోటీసులు జారీ చేసింది . తమ సంస్థకు ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని ..మీ సినిమా కోసం ఈ టైటిల్ ని పెట్టి మా సంస్థ ప్రతిష్టకు భంగం కలిగిస్తే ఊరుకునేదే లేదని.. నోటీసుల్లో పేర్కొందట. వారం రోజుల్లో ఒక పేరు మార్చకపోతే లీగల్ గా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరిచ్చిందట. ఈ సినిమా టైటిల్ ని సెలక్ట్ చేసింది నయన తారనేనట. దీనిపై చిత్ర బృందం ..విగ్నేశ్ శివన్ స్పందించాల్సి ఉంది..!!