“దేవర” నుంచి అద్దిరిపోయే అప్డేట్ వచ్చేసిందోచ్.. టక్కేసి మరి కుమ్మి పడేసిన ఎన్టీఆర్..ఏమున్నాడు రా బాబు..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న సినిమా “దేవర”. ఆర్ఆర్ఆర్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత చాలా టైం గ్యాప్ తీసుకొని మరి ఓకే చేసిన సినిమా ఇదే . కొరటాల శివ కూడా ఆచార్య లాంటి బిగ్ డిజాస్టర్ తర్వాత చాలా టైం గ్యాప్ తీసుకొని మరి ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. కాగా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 5 , 2024న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది.

రీసెంట్గా న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికర అప్డేట్ ఒకటి రిలీజ్ చేశారు మేకర్స్. న్యూ ఇయర్ సంధర్భంగా సరికొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ గ్లింప్స్ డేట్ ని ప్రకటించారు . ఈ పోస్టర్లో ఎన్టీఆర్ సీరియస్ గా చూస్తూ ఉండగా ..బ్లాక్ డ్రెస్ లో టక్ వేసుకొని మరి పడవలో నిల్చుని సముద్రంలో నుంచి వస్తున్నట్లు చాలా గంభీరంగా చూపిస్తారు .

దేవర గ్లింప్స్ ను జనవరి 8న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు . కాగా ఈ సరికొత్త లుక్స్ చూసిన అభిమానులు ఫిదా అయిపోతున్నారు . అంతేకాదు ఏదైనా సాహసాలు చేయాలి అన్నా.. కొత్త కంటెంట్ కు నాంది పలకాలి అన్న ఎన్టీఆర్ పర్ఫెక్ట్ అని… ఎన్టీఆర్ తర్వాతే మరి ఎవరైనా అంటూ దేవరకు హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తున్నారు . న్యూ ఇయర్ సందర్భంగా దేవర టీం రిలీజ్ చేసిన పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటుంది..!!