నాగార్జున చీకొట్టిన సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ సాధించిన వెంకటేష్.. మూవీ ఏంటంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో విక్ట‌రీ వెంకటేష్ కు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో నటించి బ్లాక్ బాస్టర్ హిట్ల‌ను తన ఖాతాలో వేసుకున్న వెంకటేష్.. ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు. చాలామంది స్టార్ హీరోయిన్లకు కెరీర్ ఇచ్చిన వెంకీ మామ న‌ట‌న‌తో కోట్లాదిమంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పటికీ వెంకటేష్ సినిమా వస్తుందంటే ఫ్యామిలీ ఆడియోస్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.

కుటుంబంతో కలిసి సినిమా చూడాలని ఆశ పడుతూ ఉంటారు. ఆ రేంజ్ లో పాపులారిటీ దక్కించుకున్న వెంకటేష్.. గతంలో నాగార్జున రిజెక్ట్ చేసిన ఓ సినిమాను నటించి బ్లాక్ బాస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడంటూ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి అనుకుంటున్నారా.. ఫ్యామిలీ సెంటిమెంట్‌తో తెర‌కెక్కిన‌ సంక్రాంతి. ఈ సినిమాను మొదట నాగార్జునతో తీయాలని మూవీ డైరెక్టర్ ముప్పలనేని శివ భావించాడట.

అయితే నాగార్జునకు కథ వినిపించగా.. ముగ్గురు తమ్ముళ్లు, ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమా అనగానే నాగ్‌ ఈ సినిమాను రిజెక్ట్ చేశాడట. దీంతో వెంకటేష్ కథను వినిపించడం.. ఆయ‌న‌ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందని సంక్రాంతి మూవీ డైరెక్టర్ ముప్ప‌ల‌నేని శివ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. ఇక ఆ సినిమా రిలీజై ప్రేక్షకులను ఏ రోజులో ఆకట్టుకుందో తెలిసింది. ఇప్పటికీ ఈ సినిమా వస్తుందంటే చాలు బుల్లితెర ప్రేక్షకులంతా టీవీ ముందే ఉంటారు. ప్రస్తుతం సంక్రాంతి లాంటి సినిమాను నాగార్జున వదులుకున్నాడని తెలియడంతో నాగ్‌ ఫ్యాన్ ఫీల్ అవుతున్నారు.