అలాంటి బిజినెస్ లోకి అడుగుపెట్టిన భూమిక.. మీ రేంజ్కి ఇది చీప్ అంటున్న ఫ్యాన్స్..!

టాలీవుడ్ లో ఒకప్పటి స్టార్ హీరోయిన్ గా కొనసాగిన వారిలో భూమిక ఒకరు. ఈ ముద్దుగుమ్మ తన అందంతో, నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం పెద్దగా సినిమా అవకాశాలు రాకపోవడంతో సినీ ఇండస్ట్రీకి దూరమైంది. ఈ క్రమంలోనే వ్యాపార రంగంలోకి అడుగు పెట్టింది భూమిక.

హోటల్ బిజినెస్ లోకి ఈమె ఎంట్రీ ఇస్తుందట. ఇక ఈ విషయాన్ని భూమికనే స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ” గోవాలో మా కొత్త వెంచర్ సమర వెల్నెస్ హోటల్ ప్రారంభించాం. వినోదం, విశ్రాంతి కోసం మాతో చేరండి.

వివిధ రకాల చికిత్సలు మరియు స్సా, చక్కటి సంగీతం డాన్స్ కోసం వైల్నెస్ హోటల్కు రావాలి ” అంటూ ఓ పోస్ట్ ని షేర్ చేసింది భూమిక. ఇక ప్రస్తుతం భూమిక పోస్ట్ వైరల్ కావడంతో ఈమె అభిమానులు..” మీ రేంజ్కి ఇది చాలా చీప్ మేడం. మీరు ఒకప్పటి హీరోయినే అయినా ఇప్పటి జనరేషన్ కి రోల్డ్ మోడల్ ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.