ఆ విషయంలో ప్రభాస్ పై కోపడ్డిన రాజమౌళి..అంత గట్టిగట్టిగా అరుస్తున్నాడు ఏంటి (వీడియో) వైరల్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శక ధీరుడుగా పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళికి ప్రభాస్ కి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . వీళ్ళిద్దరూ ఒక హీరో డైరెక్టర్ లా కాకుండా ఫ్రెండ్స్ లా చాలా చాలా క్లోజ్ గా ఉంటారు. ప్రభాస్ తో చత్రపతి – బాహుబలి 1 – బాహుబలి 2 సినిమాలి తెరకెక్కించి సెన్సేషనల్ రికార్డ్స్ అందుకున్న రాజమౌళి ..ప్రభాస్ ని అరిచిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఛత్రపతి ప్రమోషన్స్ టైం లో రాజమౌళి – ప్రభాస్ ఇద్దరు కూర్చుని ఈ సినిమా జనాల్లోకి వెళ్లడానికి హిట్ అవ్వడానికి కారణం.. మీరంటే మీరు అంటూ రాజమౌళి – ప్రభాస్ ఇద్దరు ఒకరిని ఒకరు పొగిడేసుకుంటారు . అయితే ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత రాజమౌళి తన టీం తో అసలు ప్రభాస్ ఈ సినిమా కోసం ఏం చేశాడు .. నేనే అంతా కష్టపడ్డాను అవును కదా ..అంటూ తన టీం తో మాట్లాడుతాడు .

వాళ్లు కూడా అదే విధంగా ఎస్ సార్ మీరే ఇంపార్టెంట్.. మీ వల్లే సినిమా ఇంత హిట్ అయింది అంటారు . అదేవిధంగా ప్రభాస్ వాళ్ళ టీం ని అడిగినప్పుడు మీ వల్లే ప్రభాస్.. ఈ సినిమా ఇంత హీట్ అయింది అంటూ ప్రభాస్ ని పొగిడేస్తారు. ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . జక్కన్న – ప్రభాస్ ఈ ఫన్నీ వీడియో లో చాలా న్యాచురల్ యాక్టింగ్ కనబరిచారు .దీనితో సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా ట్రెండ్ అవుతుంది..!!