పొట్టి బట్టల్లో యోగాసనాలు వేస్తూ మతిపోగోడుతున్న ప్రభాస్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా.. ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి సెలబ్రిటీగా ఎదగాలంటే అందం, టాలెంట్ తో పాటు కూసంత అదృష్టం కూడా ఉండాలి. అయితే కొంతమంది అదృష్టం లేకపోవడంతో మంచి టాలెంట్ అందం ఉన్నప్పటికీ స్టార్ గా పాపులర్ కాలేకపోతారు. అలాంటి లిస్టులోకే వస్తుంది ఈ పై ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ. ఇంతకీ పొట్టి బట్టల్లో యోగా చేస్తూ కుర్రాళ‌ను కవ్విస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.. ఈమె శ్రద్ధదాస్. ఇండస్ట్రీ లోకి వచ్చి చాలా కాలం అవుతున్న స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. అందరూ ఆకట్టుకునే అందం, టాలెంట్ ఉన్నప్పటికీ హీరోయిన్‌గా క్రేజ్‌ సంపాదించుకోలేకపోయింది. అల్లరి నరేష్ హీరోగా నటించిన సిద్దు ఫ్రమ్‌ శ్రీకాకుళం సినిమాతో వెండితెరకు పరిచయమైన‌ ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించింది.

అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో కూడా వ్యాంప్ రోల్‌లో మెప్పించింది. ఆర్య 2 సినిమాలో ఆమె అల్లు అర్జున్ ప్రేమించే ఆఫీస్ కొలీక్‌గ్లా మెప్పించింది. డార్లింగ్ సినిమాలో కూడా ప్రభాస్‌ను ప్రేమించి సూసైడ్ చేసుకునే విలన్ కూతురి రోల్ ప్లే చేసింది. ఈ సినిమాలు హిట్ అయినప్పటికీ త‌న పాత్ర‌ల‌కు అంతగా ప్రాధాన్యత లేకపోవడంతో ఆఫర్స్ రాలేదు. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, గెస్ట్ రోల్ లో మాత్రమే పలు సినిమాల్లో నటించింది. ఇక ఇటీవల అడల్ట్ కామెడీ మూవీ అయినా మినీ క‌థ‌లో నటించింది. ఇందులో సంతోష్ శోభన్ హీరోగా, శ్రద్ధాదాస్ గ్లామ‌ర్ రోల్‌లో కనిపించింది.

సినిమా సక్సెస్ కావడంతో శ్రద్ధదాస్‌కి కొంత ఫేమ్‌ వచ్చిందని చెప్పాలి. అయినా ఊహించిన అవకాశాలు రావడం లేదు. ఇక శ్రద్ధాదాస్ బిగ్ బాస్ షో కి వస్తారంటూ గతంలో పుకార్లు వినిపించాయి. ఈ పుకార్లను ఖండించిన శ్రద్ధ.. పలు భాషల్లో సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నా.. నేను ఎందుకు బిగ్‌బాస్‌కు వెళ్తా అంటూ చెప్పుకొచ్చింది. ఇక సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ గ్లామరస్ ఫోటోలను షేర్ చేసుకునే ఈ అమ్ముడు.. తాజాగా పొట్టి బట్టలు ధరించి యోగాసనాలు వేస్తూ ఫోజులు ఇచ్చింది. ఇక నటన విషయాన్ని పక్కన పెడితే ఈమె దేవిశ్రీప్రసాద్ తో కలిసి బలిసింగి షోలో సింగర్ గా కూడా సందడి చేస్తుంది.