దిల్ రాజును తొక్కేయాలని చూస్తుంది..ఆ పెద్ద మనిషేనా..? డబ్బులు ఇచ్చి వార్తలు రాయిస్తున్నాడా..?

ఒకరు పైకి ఎదుగుతున్నారు అంటే పక్క వ్యక్తులు అతనిని లాగడానికి.. చూస్తూ ఉంటారు. అది ఏ రంగమైనా సరే ఆఖరికి మన ఇంటి పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు అయినా సరే ఎవరైనా ఒక మనిషి బాగుపడుతున్నారు అంటే చూడలేరు . వారిని ఎలా తొక్కేయాలి ఎలా దిగజార్చాలి అని చూస్తూ ఉంటారు . సినిమా ఇండస్ట్రీలో అలాంటి జనాలు కూసింత ఎక్కువగానే ఉంటారు. కాగా రీసెంట్గా దిల్ రాజు ఇష్యూ చూసిన తర్వాత ఆ విషయం ఫుల్ గా క్లియర్ గా అర్థమైపోయింది జనాలకి. నిన్న మొన్నటి వరకు దిల్ రాజుని ఓ దేవుడులా చూసిన సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ఆయనే ఇండస్ట్రీకి పెద్ద కష్టంగా మారిపోయాడు అంటూ పలువురు జనాలు ఆయనను తిట్టుకునేలా కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి .

మనకు తెలిసిందే ఈ సంక్రాంతికి గుంటూరు కారం హనుమాన్ సినిమాల మధ్య టఫ్ కాంపిటీషన్ నెలకొంది. మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో తేజ సజ్జా లాంటి చిన్న హీరో పోటీ పడుతూ ఉండడం.. అభిమానులకి ఆశ్చర్యకరంగా ఉంది . అయితే మహేష్ బాబు సినిమాకి ఎక్కువ థియేటర్స్ కేటాయించి తేజ సబ్జా నటిస్తున్న హనుమాన్ సినిమాకి తక్కువ థియేటర్స్ ఇచ్చాడు అంటూ దిల్ రాజు పై నిందలు వేశారు కొందరు , ఈ వివాదం చిలికి చిలికి గాలి వానగా మారింది .

ఎంతలా అంటే డైరెక్ట్ గా స్టేజిపై మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ ఇష్యూ పై రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. అయితే దానిని కూడా కొంతమంది వ్యంగ్యంగా కౌంటర్ చేశారు . నెగటివ్గా చేసి చూపించి వార్తలు రాశారు . దీంతోఫైర్ అయిపోయిన దిల్ రాజు ఫుల్ కోపంతో ఊగిపోయారు . తాటతీస్తా అంటూ స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చారు . అయితే ఇదంతా చూసిన జనాలు కావాలని దిల్ రాజు పై ఒక బడా స్టార్ట్ ప్రొడ్యూసర్ నిందలు వేస్తున్నారు అని ఆయన ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాలు ఈ మధ్యకాలంలో బాగా సక్సెస్ అవుతూ ఉండడంతో ఆయనకు పెద్ద కాంపిటీషన్ గా వస్తున్నాడు అని తెలిసి

ఓ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు పై తప్పుడు వార్తలు రాయిస్తున్నారనే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు చాలామంది దిల్ రాజును పొగుడుతూ .. ఉంటే కేవలం రెండు మూడు సైట్లు మాత్రమే ఆయనపై నెగటివ్గా ప్రచారం చేస్తున్నాయని .. ఆ విషయం దిల్ రాజుకు కూడా తెలుసు అని .. అందుకే ఆ రెండు సైట్లను మాత్రమే టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడారని జనాలు చెప్పుకుంటున్నారు . ఇలా దిల్ రాజు కెరీర్ ను తొక్కేయడానికి ఆ బడా ప్రొడ్యూసర్ డబ్బులు ఇచ్చి వార్తలు రాయిస్తున్నాడు అన్న వార్త ఇప్పుడు వైరల్ అవుతున్నాయ్..!!