తండ్రి అయిన బిగ్ బాస్ అర్జున్.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..

బిగ్ బాస్ సీజన్ 7 ర‌స‌వ‌త్త‌రంగా కొనసాగిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సీజన్‌కు ఎండ్ కార్డ్ ప‌డ్డింది. అయితే అర్జున్ కూడా ఈ ఫోలో కంటెస్టెంట్గా సందడి చేశాడు. వైల్డ్ కార్డ్‌ ఎంట్రీతో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టిన అర్జున్.. తనదైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. టాస్కులలో 100% ఇస్తూ తన సత్తా చాటుకున్నాడు. కానీ వైల్డ్ కార్డు ఎంట్రీ అనే ఒకే ఒక్క రీజన్ తో కప్ గెలుచుకోలేకపోయాడని చాలా మంది త‌మ అభిప్రాయాని వ్య‌క్తం చేశారు.

ఇక ఈ సీజన్స్ 7 రన్నింగ్ సమయంలో అర్జున్ భార్య సురేఖ ప్రెగ్నెంట్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా తాజాగా అర్జున్ భార్య పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అర్జున్‌ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆసక్తికర పోస్ట్ రూపంలో షేర్ చేసుకున్నాడు. తనకు కూతురు పుట్టినట్లు ప్రకటించడంతోపాటు.. ఆ పాపకు ఆర్కా అని నామకరణం చేసినట్లు వివరించాడు. దీంతో అర్జున్ – సురేఖ దంపతులకు టాలీవుడ్ ప్రముఖులతో పాటు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ప్రస్తుతం నెట్టింట ఈ పోస్ట్ తెగ చక్కర్లు కొడుతుంది. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉండగానే అర్జున్ కు డైరెక్టర్ బుచ్చిబాబు.. రామ్ చరణ్ సినిమాలో అవకాశాన్ని ఇచ్చినట్లు అనౌన్స్ చేశాడు. దీంతో ఒక్కసారిగా అర్జున్ క్రైజ్ మరింత పెరిగింది. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అర్జున్ ఓ పక్క తన భార్యను చూసుకుంటూ.. పలు టీవీ షోల‌లో కూడా సందడి చేశాడు.