కివీ ఫ్రూట్స్ తింటుంటే తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు ఇవే..!

కివీ పండ్లు చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ మరి కొంతమంది మాత్రం వీటిని అస్సలు దగ్గరికి కూడా రానివ్వరు. ఈ పండు చూడడానికి ముదురు గోధుమ రంగుతో కోడి గ్రుడ్డు ఆకారంలో ఉండి లోపల అనేక నల్లని గింజలతో నిండిన ఆకుపచ్చ లేదా లేత పసుపు పచ్చ గుజ్జు కలిగి ఉంటుంది. ఈ పండు స్రీలు తింటుంటే ఎక్కువ పుష్టి, రుతుక్రమ ఇబ్బందులు తొలుగుతాయి. ఈ పండు వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

కమల పండ్లకు రెట్టింపు విటమిన్ సి, ఆపిల్ లో కన్నా ఐదు రెట్లు ఎక్కువ పోషకాలు ఈ పండులో ఉంటాయి. కొవ్వులు, సోడియం తక్కువగా ఉండడం వల్ల డయాబెటిస్ ఉన్నవారు వీటిని తినవచ్చు. అలాగే ఈ పండ్లను తినడం వల్ల అధిక బరువుతో బాధపడుతున్న వారు కూడా విముక్తి పొందుతారు. ఇక శ్వాస, ఆస్తమా వంటి సమస్యలను ఈ పండు తొలగిస్తుంది.

ఈ పండ్లు తింటే నేత్ర సంబంధిత వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే క్యాన్సర్ ను కూడా ఈ పండు నివారిస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే కివి పండు జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. ఇక గర్భిణీ స్త్రీలకు ఈ పండును ఇస్తే మంచి పోషకాలు లభిస్తాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ పండుని కచ్చితంగా తినవాల్సిందే. లేదంటే మంచి పోషకాలను మిస్ అయిన వారు అవుతారు.