‘ హనుమాన్’ మూవీ ఫస్ట్ ఛాయిస్ తేజ కాదా.. ఈ సినిమాలో రిజెక్ట్ చేసిన స్టార్ హీరోలు వీళ్లే..

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ హీరోగా పాన్ ఇండియా లెవెల్లో తెర‌కెకుతున్న మూవీ హనుమాన్. ఇప్పటికే సినిమాపై ప్రేక్షకుల్లో మంచి హైప్‌ నెలకొంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా చాలా డిఫరెంట్ గా జరుగుతున్నాయి. సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమాలకు పోటీగా నిలబడుతున్న ఈ సినిమాకు థియేటర్ల కొర‌త కూడా బాగానే ఉన్నట్లు వార్తలు వినిపించాయి. ఇక హనుమాన్ ఫ్రీ రిలీజ్ ఇంట్లో కూడా స్టార్ హీరో చిరంజీవి హాజరై సందడి చేశారు. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో మరింత హైప్ నెల‌కొంది. ప్రశాంత్ వర్మ, తేజ కాంబినేషన్లో ఇది మూడవ సినిమా కావడం విశేషం. వీరి కాంబినేషన్‌లో జాంబిరెడ్డి, అద్భుతం సినిమాలు వచ్చి పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్నాయి.

ఇక ఇటీవల తెర‌కెక్కించిన హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ పేరు పాన్ ఇండియా లెవెల్లో మారుమోగిపోతుంది. ఏకంగా రూ.55 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇలాంటి భారీ ప్రాజెక్టుతో తేజ సజ్జ లాంటి చిన్న హీరోని బదులు ఏదైనా స్టార్ హీరోని తీసుకుని ఉంటే బాగుండేది అంటూ చాలా కామెంట్లు వినిపించాయి. అయితే ఈ సినిమాకు మొదటగా అందరూ అనుకున్నట్లుగానే టాలీవుడ్ స్టార్ హీరోలు ఇద్దరిని ప్రశాంత్ వర్మ కలిసాడట. అయితే వారు క‌థ న‌చ్చిన ఏవో కార‌ణాల‌తో మూవీకి నో చెప్పడంతో.. ఈ సినిమాకు తేజ సజ్జను కన్ఫామ్ చేసినట్లు తెలుస్తుంది.

ఇంతకీ ఆ ఇద్దరు హీరోలు ఎవరు అనుకుంటున్నారా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నాచురల్ స్టార్ నాని. మొదట హనుమాన్ కథను అల్లు అర్జున్ కు వినిపించగా.. కథ నచ్చినప్పటికీ డేట్స్ ఖాళీ లేకపోవడంతో సినిమాను వదులుకున్నాడట. ఆ తర్వాత నానిని కలిసాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ సినిమాను సొంత బ్యానర్ లో నిర్మిద్దామని నాని కూడా భావించాడని.. బడ్జెట్ ఎక్కువ కావడంతో నాని ఈ సినిమాను వదిలేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మరో హీరో దగ్గరికి వెళ్లడం ఇష్టం లేని ప్రశాంత్.. తేజనే హీరోగా పెట్టి సినిమాను తెర‌కెక్కించాడు. అలా హనుమాన్ మూవీ ఇద్దరు స్టార్ హీరోల చేతి నుంచి తప్పుకొని తేజ చేతిలోకి వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా పై ఉన్న హైప్ రిత్య ప్రీమియర్ షోలు కనుక పాజిటివ్ టాక్ వస్తే సంక్రాంతి బారిలో మొదటి హిట్గా హనుమాన్ నిల‌వ‌డం ప‌క్కా.