‘ గుంటూరు కారం ‘ టీమ్ కు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్.. పండగ చేసుకుంటున్న నిర్మాతలు..

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల నటించిన మూవీ గుంటూరు కారం. త్రివిక్రమ్ – మహేష్ కాంబోలో 12 ఏళ్ల తర్వాత తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా గుంటూరు కారం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ గుంటూరు కారం నిర్మాతలకు గుడ్ న్యూస్ చెప్పినట్లయింది.

అయితే మూవీ విడుదల సందర్భంగా టికెట్ ధరల పెంపుకు అంగీకరిస్తున్నట్లుగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ కు రూ.65, మల్టీప్లెక్స్ టికెట్లకు రూ.100 పెంచుకునేందుకు తెలంగాణ సర్కార్ అనుమతించింది. సినిమా రిలీజ్ డేట్ నుంచి వారం రోజుల వరకు మొత్తం ఆరు షోలకు పర్మిషన్ దొరికింది.

అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా బెనిఫిట్ షోలు వేసుకునేందుకు కూడా తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో 11న రాత్రి ఒంటిగంటకు 23 చోట్ల గుంటూరు కారం బెనిఫిట్ షోలు ప్రదర్శించబోతున్నారు. ప్రస్తుతం తెలంగాణ సర్కార్ ఈ రేంజ్ లో తమకు అవకాశం ఇవ్వడంతో నిర్మాతలు ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.