ఈపాలి పండక్కి ‘నా సామిరంగ’ ట్రైలర్ రిలీజ్.. ఊర నాటు మాస్ జాతరే(వీడియో)..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న నాగార్జున తాజాగా నటించిన సినిమా ” నా స్వామి రంగ”. ఈ సంక్రాంతికి నాగార్జున కూడా బాక్సాఫీస్ వద్ద టఫ్ కాంపిటీషన్ ఇవ్వబోతున్నాడు. జనవరి 14వ తేదీ సంక్రాంతి కానుకగా ఆయన నటించిన “నా స్వామి రంగా” సినిమా రిలీజ్ కాబోతుంది . సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్న నాగార్జున సినిమాకి మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు . ఈ సినిమాలో అల్లరి నరేష్ – రాజ్ తరుణ్ ముఖ్యపాత్రలు పోషిస్తూ ఉండగా హీరోయిన్స్ గా ఆషికా రంగనాథ్,మిర్నా మీనన్, రుక్సార్ థిల్లాన్ నటిస్తున్నారు.

ముగ్గురికి ముగ్గురు టాప్ ఫిగర్లు ..కత్తిలాంటి అందగత్తెలే.. సినిమాలో వీళ్లని ఎలా చూపిస్తారు డైరెక్టర్ అంటూ జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . డాన్స్ మాస్టర్ విజయ్ బన్నీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 14న రిలీజ్ కాబోతూ ఉండడంతో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్ . ఈ క్రమంలోనే రిలీజ్ అయిన ట్రైలర్ అద్భుతంగా ఆకట్టుకుంటుంది. ఈ మూవీ మలయాళ సూపర్ హిట్ మూవీ”పోరింజు మరియం జోస్” అన్న సంగతి అందరికీ తెలిసిందే.

స్నేహం – ప్రేమ – రివేంజ్ డ్రామా తో తెరకెక్కిన ఈ కథ అధ్యంతం అందరినీ ఆకట్టుకునేలా ఉంది. మరి ముఖ్యంగా నాగార్జున నాటి డైలాగ్ సినిమాకి మరింత ప్లస్ గా మారిపోబోతున్నాయి అని చెప్పడంలో సందేహం లేదు .అల్లరి నరేష్ – రాజ్ తరుణ్ కూడా తమ పాత్రకు తగ్గ న్యాయం చేశారు . ట్రైలర్ చూస్తుంటే కచ్చితంగా ఈ సంక్రాంతికి ఫ్యామిలీ అంతా కలిసి చూసి ఎంజాయ్ చేసే మూవీ అంటూ తెలిసిపోతుంది . అంతేకాదు నాగార్జున ఎంత మన్మధుడు అనేది ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ ఆయన నోటి నుండి వింటుంటేనే అర్థం అయిపోతుంది.ఈ రీమేక్లో రాజ్ తరుణ్ పాత్రని కొత్తగా జత చేశారు మేకర్స్. కథ కూడా చాలా చక్కగా రాసుకున్నట్లు ట్రైలర్ బట్టి తెలిసిపోతుంది. మరెందుకు ఆలస్యం ట్రైలర్ ని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి..!!